Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీMNC Job Salary Hike Issue India: ఎంఎన్సీ లో ఉద్యోగం.. ఏడాది క్రితం ₹9...

MNC Job Salary Hike Issue India: ఎంఎన్సీ లో ఉద్యోగం.. ఏడాది క్రితం ₹9 హైక్.. ఇప్పుడు అదీ లేదు..

MNC Job Salary Hike Issue India: బహుళ జాతి సంస్థలో ఉద్యోగం అంటే ఎవరైనా సరే ఎగిరి గంతులు వేస్తారు. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని చేసేవారు కాలర్ ఎగరేస్తారు. ఎందుకంటే ఐదు అంకెల జీతం.. అంతకుమించిన జీవితం.. సౌకర్యాలు.. సౌలభ్యాలు.. వారంలో రెండు రోజులు సెలవులు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అయితే ఇదంతా అబద్ధమా.. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం అంటే బానిసత్వానికి పరాకాష్ట లాగా ఉంటుందా.. చెప్పుకునే స్థాయిలో సౌకర్యాలు ఉండవా.. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరా.. ఈ ప్రశ్నలకు ఢిల్లీ నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి చెప్పిన సమాధానాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇప్పటికే బహుళ జాతి సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నిరాటకంగా కొనసాగుతోంది. భవిష్యత్తు కాలంలో ఇలాంటి విధానాలు కొనసాగుతాయని, ఆయా సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్ కోలుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఉద్యోగం చేస్తున్నవారు.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఆందోళనలో కూరుకుపోయారు. ఉద్యోగం రాని వాళ్ళది ఒక బాధ అయితే.. ఉద్యోగం ఉన్న వాళ్ళది మరొక రకమైన బాధ.

ఢిల్లీ నగరంలో ఒక మల్టి నేషనల్ కంపెనీలో ఓ ఉద్యోగి పని చేస్తున్నాడు. అతడికి గత ఏడాది కేవలం 9 రూపాయలు మాత్రమే జీతం పెరిగింది.ఈ ఏడాది అది కూడా లేదు. పైగా బాండ్, నోటీస్ పీరియడ్ వంటి కారణాలవల్ల ఉద్యోగం మారలేకపోతున్నాడు. ప్రయాణ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీ వాటిని కూడా ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో అతడు తన బాధను వ్యక్తం చేయడంతో మల్టి నేషనల్ కంపెనీలలో జరుగుతున్న దారుణం బయటపడింది..

అతడు పెట్టిన ఈ పోస్ట్ మీద రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోయిందని.. కంపెనీల అవసరాలు వేరే విధంగా ఉన్నాయని.. అలాంటప్పుడు నైపుణ్యాలు పెంచుకోవలసిన బాధ్యత ఉద్యోగుల మీద ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అలాకాకుండా రొటీన్ గా పని చేస్తే ఏ కంపెనీ కూడా ఒప్పుకోదని.. బాండ్, ఇతరత్రా ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ భరిస్తోందని.. అవి లేకుంటే ఎప్పుడో బయటికి పంపించేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.. మరికొందరేమో కంపెనీ విధానాల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని.. అలా కాకుండా కేవలం 9 రూపాయలు వేతనం పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కంపెనీ నిర్వాహకులు ఒకసారి బయటికి వచ్చి బతికి చూపించాలని.. ఆ స్థాయిలో ఖర్చులు పెరిగిపోయిన తర్వాత వారికి కూడా అర్థమవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఒత్తిడి ఉందని.. దానిని సాకుగా చూపించి ఉద్యోగులను వేధిస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని నెటిజన్లు చెబుతున్నారు. కార్మిక చట్టాలు మల్టి నేషనల్ కంపెనీలకు వర్తించవా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper