Indigo Airlines: మన దేశంలో ఉన్న చట్టాలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని సమయాల్లో అత్యవసరమైన సేవలు కూడా తాత్సారంగా సాగుతాయి. కొన్ని విషయాల్లో గోప్యత పాటించల్సిన విషయాలు కూడా బహిరంగంగా వెల్లడవుతుంటాయి. అలాంటి విచిత్ర సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. విమానంలో లగేజీ మారడంతో సదరు ప్రయాణికుడు ఆందోళన చెందినా విమానయాన సంస్థ స్పందించలేదు. ప్రయాణికుల వివరాలు బయటపెట్టడం వీలు కాదని చెప్పడంతో అతడు చేసిన పనికి సంస్థ ఆశ్చర్యపోయింది.

గత ఆదివారం నందన్ కుమార్ అనే వ్యక్తి పాట్నా నుంచి బెంగుళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణం చేశాడు. ఎయిర్ పోర్టులో దిగిన అతడు యథావిధిగా తన లగేజీ తీసుకుని ఇంటికి వెళ్లాడు. తీరా వెళ్లి చూసే సరికి అది తన లగేజీ కాదు. మారిపోయింది. దీంతో సదరు విమానయాన సంస్థ అధికారులను సంప్రదించాడు. కానీ వారు సరైన సమాధానం ఇవ్వలేదు. ప్రయాణికుల వివరాలు చెప్పడం కుదరదని తేల్చేశారు. దీంతో అతడు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి.
దీంతో అతడు ఇండిగో వెబ్ సైట్ ను హ్యాక్ చేసి తన లగేజీ తీసుకెళ్లిన ప్రయాణికుడి వివరాలు తెలుసుకున్నాడు. దీంతో నందన్ అతడిని కలుసుకుని తన లగేజీని తిరిగి తెచ్చుకున్నాడు. దీనిపై ట్విటర్ లో నందన్ ఇండిగో ఎయిర్ లైన్స్ పై సూచనలు చేస్తూ పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది నెట్టింట్లో వైరల్ కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సమాచారం లీక్ చేసినందుకు నందన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అత్యంత గోప్యతగా పాటించే వ్యవహారాలను సైతం ఇలా హ్యాక్ చేయడంతో సంస్థ ఖంగుతింది. నందన్ కస్టమర్ కేర్ తో కాకుండా ఇతర దారుల్లో ప్రయాణికుడిని సంప్రదించాడని చెబుతోంది. మొత్తానికి ఇప్పుడు నందన్ తీరుతో ఎయిర్ లైన్స్ కే మచ్చ వచ్చి పడినట్లు అయింది. అందుకే అవసరమైన సందర్భాల్లో స్పందించి ప్రయాణికుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కూడా చేస్తే మంచిదనే వాదనలు వస్తున్నాయి.