Homeక్రీడలుక్రికెట్‌Mohammed Siraj T20 team exclusion: టి20 జట్టు నుంచి సిరాజ్ ను ఎందుకు...

Mohammed Siraj T20 team exclusion: టి20 జట్టు నుంచి సిరాజ్ ను ఎందుకు తప్పించారు.. ఏం జరిగింది..

Mohammed Siraj T20 team exclusion: టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 300 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది . టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయంలో టీమిడియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. టీమ్ ఇండియా తదుపరి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ లు ఆడుతుంది. ఈ టోర్నీలకు సిరాజ్ కు చోటు లభించింది. త్వరలోనే […]

Mohammed Siraj T20 team exclusion: టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 300 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది . టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయంలో టీమిడియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. టీమ్ ఇండియా తదుపరి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ లు ఆడుతుంది. ఈ టోర్నీలకు సిరాజ్ కు చోటు లభించింది.

త్వరలోనే టీమిండియా ఐర్లాండ్ బయలుదేరాల్సి ఉండగా.. ఊహించని వార్త స్పోర్ట్స్ వర్గాల్లో కనిపిస్తోంది. ఎందుకంటే టి20 జటలో కీలకమైన బౌలర్ గా ఉన్న సిరాజ్ ను తప్పించారు. దీని వెనక ప్రధాన కారణం అతని మీద వర్క్ లోడ్ తగ్గించడమే. అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణకు అవకాశం కల్పించారు. వర్క్ లోడ్ తగ్గించుకొని.. విశ్రాంతి తీసుకోవాలని మేనేజ్మెంట్ సూచించినట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సిరాజ్ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. బుమ్రా కు వర్క్ లోడ్ పేరుతో మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వడంతో.. జట్టు బౌలింగ్ భారాన్ని మొత్తం ఇతడే మోసాడు. అంతటి ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది అంటే దానికి ప్రధాన కారణం సిరాజ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అతడు కూడా ఇటీవల కాలంలో వర్క్ లోడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. దీనిని మేనేజ్మెంట్ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక మ్యాచ్లో సిరాజ్ తన స్థాయి బౌలింగ్ వేయలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం వర్క్ లోడ్ అని గుర్తించడం మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు అతనికి విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో ప్రసిద్ ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు సిరాజ్ ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే అతడు వర్క్ లోడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు.. దీనిని గుర్తించిన మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది..

ఈ సిరీస్ లు ముగిసిన తర్వాత టీమ్ ఇండియా న్యూజిలాండ్.. శ్రీలంక జట్లతో టెస్ట్ సిరీస్ లు ఆడాల్సి ఉంది. అందువల్ల మేనేజ్మెంట్ దానిని దృష్టిలో పెట్టుకొని సిరాజ్ ను విశ్రాంతి తీసుకోమని సూచించింది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే కచ్చితంగా ఆ రెండు సిరీస్ లు గెలవాలి.. దానిని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper