Vihaan Malhotra: విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. టీమిండియాలో కూడా అతడికి వీరాభిమానాలు ఉంటారు. ఇక యంగ్ ప్లేయర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీని ఆటను.. అతని ఆటిట్యూడ్.. అతడి ఆవేశాన్ని కచ్చితంగా ఫాలో అవుతుంటారు. అలానే ప్రవర్తిస్తుంటారు కూడా.
విరాట్ కోహ్లీ ఒక సమ్మోహన శక్తి. ఎందుకంటే అతని బ్యాటింగ్ అమోఘం. అతడి ఫీల్డింగ్ అత్యద్భుతం. ఎలాంటి పరిస్థితి అయినా సరే అతడు వెనుకడుగు వేయడు. పైగా దూకుడు అనే తత్వాన్ని మరింత దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ అంటే కోట్లాదిమంది అభిమానిస్తూ ఉంటారు. ఆ జాబితాలో టీమిండియా యంగ్ ప్లేయర్ విహాన్ మల్హోత్రా కూడా ఒకడు.
విహాన్ ప్రస్తుత అండర్ 19 క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు జట్టుకు ఎంతో కీలకమైన 21 పరుగులు చేశాడు. 43 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక ఫోర్ సహాయంతో 21 పరుగులు చేయగలిగాడు. అతడు సమయోచితమైన బ్యాటింగ్ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ ను తలపించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో 18, న్యూజిలాండ్ ja జరిగిన మ్యాచ్లో 17, జింబాబ్వేత జరిగిన మ్యాచ్లో 109*పరుగులు చేశాడు. తద్వారా భవిష్యత్తు ఆశా కిరణం లాగా ఆవిర్భవించాడు.
2007లో పుట్టిన విహాన్ కు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. విహాన్ తండ్రి పేరు మనోజ్. పంజాబ్ రాష్ట్రంలోని నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో సూపరిండెంట్, తల్లి పూనం గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరికి విహాన్ క్రికెటర్ కావడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే కొడుకు అభిరుచి కాదనలేక క్రికెట్ వైపు పంపించారు. విరాట్ కోహ్లీ ని చూస్తూ పెరిగిన విహాన్.. మైదానంలో ఎక్కువ సమయం గడిపేవాడు. బ్యాటింగ్.. బౌలింగ్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో పంజాబ్ తరఫున అండర్ 16 లో 15 ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు చేశాడు. ఐదు అర్ధ సెంచరీలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా 978 పరుగులు చేశాడు. తద్వారా బీసీసీఐ నుంచి పురస్కారం కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అండర్ 19 లో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. విరాట్ కోహ్లీ సాంగత్యం మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ చూస్తే పెరిగిన వాళ్లు కూడా అతడిలాగే క్రికెటర్లు అవుతున్నారు. దీనికి విహాన్ ఒక బలమైన నిదర్శనం.