Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby Movie Update: చిరంజీవి-బాబీ మూవీ నుండి సెన్సేషనల్ అప్డేట్..నటీనటుల ప్రొఫైల్ చూస్తే మైండ్...

Chiranjeevi Bobby Movie Update: చిరంజీవి-బాబీ మూవీ నుండి సెన్సేషనల్ అప్డేట్..నటీనటుల ప్రొఫైల్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi Bobby Movie Update: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Prasad Garu) సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటీనటులు మొత్తం మంచి ప్రొఫైల్ ఉన్నవాళ్లు అవ్వడం తో, ఈ సినిమా పై రాబోయే రోజుల్లో మార్కెట్ లో […]

Chiranjeevi Bobby Movie Update: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Prasad Garu) సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటీనటులు మొత్తం మంచి ప్రొఫైల్ ఉన్నవాళ్లు అవ్వడం తో, ఈ సినిమా పై రాబోయే రోజుల్లో మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్ళ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు సతీమణి గా ప్రియమణి ఎంపిక అయ్యినట్టు తెలుస్తోంది. ప్రియమణి ఇప్పటి వరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది, ఈ సినిమాలో కూడా ఆమె రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

ఇక వీళ్లిద్దరికీ కూతురి పాత్రలో ‘ధురంధర్’ హీరోయిన్ సరా అర్జున్ నటించబోతుంది అట. ‘ధురంధర్’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యాక , ఈ అమ్మాయి ఆడియన్స్ దృష్టిలో బాగా పడింది. ఆ చిత్రం తర్వాత నేరుగా ఈ క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్ లోకి ఆమె అడుగుపెట్టబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. సౌత్ ఇండియా లో చిరంజీవి తో సమానమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న లెజండరీ నటుడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా లో కనిపించబోతుండడం, కచ్చితంగా ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం లో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియా ;లో పెద్ద చర్చ నే నడిచింది. ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లను కూడా పరిశీలించారు.

కానీ చివరికి అనురాగ్ కశ్యప్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తమిళం లో రీసెంట్ గా సూపర్ హిట్ గా నిల్చిన ఎన్నో చిత్రాల్లో అనురాగ్ నటించాడు. అందులో ‘మహారాజ’, ‘డ్రాగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ‘మహారాజ’ లో విలన్ గా ఎంత క్రూరంగా నటించాడో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అదే విధంగా ‘డ్రాగన్’ చిత్రం లో ప్రిన్సిపల్ క్యారెక్టర్ లో కూడా ఈయన జీవించేసాడు. ఇలా చెప్పుకోడానికి ఎన్నో ఉన్నాయి. అలాంటి నటుడు ఈ చిత్రం లో భాగం అవ్వడం కచ్చితంగా సినిమాకి బలం చేకూరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల డేట్స్ ని పట్టేసాడు డైరెక్టర్ బాబీ. ఇక సెట్స్ మీదకు వెళ్లడం ఒక్కటే బ్యాలన్స్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper