Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ మీద ఇంత కుట్రా.. ఆరెంజ్ క్యాప్ దూరం చేశారు కదరా..

Vaibhav Suryavanshi: వైభవ్ మీద ఇంత కుట్రా.. ఆరెంజ్ క్యాప్ దూరం చేశారు కదరా..

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల బుడ్డోడు.. ఐపీఎల్ లో అన్ని రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే దుమ్ము రేపి వదిలిపెడుతున్నాడు. ఏ మైదానాన్ని అతను చూడడం లేదు. ఏ బౌలర్ ను అతడు వదిలిపెట్టడం లేదు. బంతి పగిలే విధంగా.. బౌండరీ మీటర్ జరిపే విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడి బ్యాటింగ్ దూకుడుకు పాత రికార్డులు మొత్తం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కొత్త రికార్డులు ఎవరూ బీట్ చేయలేని విధంగా రూపొందుతున్నాయి. పదిహేను సంవత్సరాలకే ఇంతటి విధ్వంసం అంటే.. ఇక కొన్ని సంవత్సరాలు పోతే ఐపీఎల్ మొత్తం అతడి నామస్మరణ చేస్తుందేమో..

ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున వైభవ్ సూర్య వంశీ ఇప్పటికే ఒక సెంచరీ చేశాడు. పది మ్యాచ్ లు ఆడిన సూర్యవంశీ.. 404 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 40.40. స్ట్రైక్ రేట్ 237.65. ఇందులో బౌండరీలు 35, సిక్సర్లు 37. ఇతని కంటే టాప్ ప్లేస్ లో ఉన్న అభిషేక్ శర్మ స్ట్రైక్ రేటు 209.36 మాత్రమే.. సిక్సర్లు కూడా 31 మాత్రమే. దీనిని బట్టి సూర్య వంశీ బ్యాటింగ్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఏ ఆటగాడయినా చూసుకొని ఆడతాడు. కానీ సూర్య వంశీ చూడకుండానే ఆడతాడు. బంతి మీద కోపం ఉన్నట్టు పిచ్చికొట్టుడు కొడుతుంటాడు.

అటువంటి సూర్య వంశీ.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.. ఢిల్లీ బౌలర్ జెమిషన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మైదానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పటివరకు ఐపీఎల్లో వీరోచితంగా ఆడుతున్న సూర్య వంశీ ఇలా అవుట్ కావడం.. రాజస్థాన్ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. అతడు క్లీన్ బౌల్డ్ కావడంతో.. సోషల్ మీడియాలో సెటైరికల్ గా పోస్టులు పడుతున్నాయి. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడని.. అందరికీ పోటీగా ఉన్నాడని.. కుట్రలు చేశారు. 15 సంవత్సరాల బుడ్డోడి మీద మీకు ఇంత కోపమా అని.. అభిమానులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అతడు గనుక క్లీన్ బౌల్డ్ కాకపోతే.. కచ్చితంగా హాఫ్ సెంచరీ చేసేవాడు. ఆరెంజ్ క్యాప్ మరోసారి దక్కించుకునేవాడు.

సూర్య వంశీ బ్యాటింగ్ తీరు చూసి పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా ముచ్చట పడుతున్నారు. అతడు 15 సంవత్సరాల వయసులోనే ఎలైట్ క్లబ్లో చేరిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. అతడిని టీమిండియాలోకి తీసుకొస్తే ఓటములు అనేవి ఉండవని.. విజయాలు ఏకపక్షంగా మారిపోతాయని వ్యాఖ్యానిస్తున్నారు. సూర్య వంశీ ఇండియన్ క్రికెట్ కు దొరికిన ఆణిముత్యం అని కొనియాడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular