Homeక్రీడలుVibhav suryavamshi:15 ఏళ్ల బుడ్డోడిని సూపర్ స్టార్ ను చేశారు.. వాడేమో గుక్క పెట్టి ఏడుస్తున్నాడు..

Vibhav suryavamshi:15 ఏళ్ల బుడ్డోడిని సూపర్ స్టార్ ను చేశారు.. వాడేమో గుక్క పెట్టి ఏడుస్తున్నాడు..

Vaibhav Suryavanshi: ఈ ఐపీఎల్ లో గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడుతున్నారు. వారంతా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు నిర్మిస్తున్నారు. కొంతమంది బౌలింగ్ ద్వారా.. ఇంకొంతమంది బ్యాటింగ్ ద్వారా అదరగొడుతున్నారు. ఫీల్డింగ్ లో అయితే కొంతమంది ప్లేయర్లు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ఆ ప్లేయర్ల లో కొంతమంది అనుభవమంత వయసు కూడా అతనికి లేదు. కానీ, ఆ ప్లేయర్ కాదు కాదు, ఆ బుడ్డోడు ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఐపీఎల్ లో వైభవ్ సూర్య […]

Vaibhav Suryavanshi: ఈ ఐపీఎల్ లో గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడుతున్నారు. వారంతా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు నిర్మిస్తున్నారు. కొంతమంది బౌలింగ్ ద్వారా.. ఇంకొంతమంది బ్యాటింగ్ ద్వారా అదరగొడుతున్నారు. ఫీల్డింగ్ లో అయితే కొంతమంది ప్లేయర్లు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ఆ ప్లేయర్ల లో కొంతమంది అనుభవమంత వయసు కూడా అతనికి లేదు. కానీ, ఆ ప్లేయర్ కాదు కాదు, ఆ బుడ్డోడు ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు.

ఐపీఎల్ లో వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసం అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగుల వరదను చూస్తుండగానే పారిస్తున్నాడు. అతని ఆట తీరు చూసి గొప్ప గొప్ప ప్లేయర్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ మైదానంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అతడి బ్యాటింగ్ చూసి హెజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రేక్షకుల లాగా మారిపోయారు. పదునైన బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే వీరు.. సూర్య వంశీ ముందు తలవంచారు.

సూర్యవంశీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయినప్పటికీ.. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న మైదానం మీద సింహ తాండవం చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న అతడు.. అవుట్ అయిన తర్వాత నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ లో స్కోర్ చేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టు ఇలాంటి ఆట తీరు ప్రదర్శిస్తుందని ఏ అభిమాని కూడా ఊహించలేదు. అయితే ఆ లో స్కోర్ మ్యాచ్ ను కాపాడుకోవడానికి రాజస్థాన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి కోల్ కతా పోరాట పటిమ ముందు తలవంచింది.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్ సూపర్ హాఫ్ సెంచరీ తో విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేశాడు. కోల్ కతా విజయం సాధించిన తర్వాత.. రాజస్థాన్ ఆటగాడు సూర్య వంశీ మైదానంలోనే విపరీతంగా ఏడ్చాడు. తట్టుకోలేక దూరంగా వెళ్లిపోయాడు. గుక్క పెట్టి ఏడుస్తున్న అతడిని ఊరడించలేక రాజస్థాన్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊరుకోరా బాబూ మరో మ్యాచ్లో మనం కచ్చితంగా గెలుస్తామని.. అతడికి ధైర్య వచనాలు చెప్పారు. సూర్యవంశీ ఏడవడం ఇదే తొలిసారి కాదు. గత సీజన్లో అవుట్ అయినప్పుడు ఇలానే ఏడ్చాడు. ఇప్పుడు కూడా అలానే ఏడుస్తున్నాడు. పాపం బుడ్డోడు..

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper