Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: పింక్ జెర్సీ వేసుకుంటే ఏమైనా పూనకం వస్తుందా భయ్యా..మరీ ఇలా కొడుతున్నారు..

Vaibhav Suryavanshi: పింక్ జెర్సీ వేసుకుంటే ఏమైనా పూనకం వస్తుందా భయ్యా..మరీ ఇలా కొడుతున్నారు..

Vaibhav Suryavanshi: మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అన్జుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్.. వీళ్లేమీ మాములు బౌలర్లు కాదు. వికెట్లు తీయగలరు. పదునైన బంతులు వేసి చుక్కలు చూపించగలరు. అటువంటి బౌలర్లను జస్ట్ 15 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ ఏడిపించాడు. గౌహతీ మైదానంలో చైన్నై బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తగలబెట్టాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో లైవ్ లో చూపించాడు. అతడు […]

Vaibhav Suryavanshi: మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అన్జుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్.. వీళ్లేమీ మాములు బౌలర్లు కాదు. వికెట్లు తీయగలరు. పదునైన బంతులు వేసి చుక్కలు చూపించగలరు. అటువంటి బౌలర్లను జస్ట్ 15 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ ఏడిపించాడు. గౌహతీ మైదానంలో చైన్నై బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తగలబెట్టాడు.

కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో లైవ్ లో చూపించాడు. అతడు ఎదుర్కొన్నది కేవలం 17 బంతులు మాత్రమే. అందులో 4 ఫోర్లు.. 5 సిక్సర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల ద్వారానే అతడు 46 పరుగులు చేయడం విశేషం.. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 305.88 గా నమోదయిందంటే బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. సూర్యవంశీ ఇటీవల కాలంలో భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో అదర్ కొట్టాడు. ఇప్పుడు అదే టెంపో ను ఐపిఎల్ లో కంటిన్యూ చేస్తున్నాడు.

సూర్యవంశీ గతంలో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లోనే అర్థ శతకం చేశాడు . గత జరిగిన ఐపీఎల్లో అతడు ఈ ఘనత సాధించాడు. గతంలో హాఫ్ సెంచరీ చేయడానికి 17 బంతులను తీసుకుంటే.. ఇప్పుడు 15 బంతుల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. సూర్య వంశీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం పట్ల రాజస్థాన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కచ్చితంగా ఈసారి తమ జట్టు అద్భుతం చేస్తుందని నమ్ముతున్నారు.

వైభవ్ కంటే ముందు ఈ జాబితాలో జైస్వాల్ ముందున్నాడు. సరిగ్గా 2023లో కోల్ కతా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మీద సాధించిన రికార్డుకు ఒక బంతి దూరంలో ఆగిపోయాడు. పింక్ జెర్సీ వేసుకుంటే తమకు పూనకం వస్తుందని.. ఇద్దరు ఆటగాళ్లు నిరూపించారు.

ఇక ఐపీఎల్ లో చెన్నై జట్టుపై విజయాలపరంగా రాజస్థాన్ రాయల్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. చెన్నై జట్టుపై 16 విజయాలు సాధించిన రెండవ జట్టుగా పంజాబ్ తో సమానంగా ఉంది. ఈ జాబితాలో 21 విజయాలతో ముంబై మొదటి స్థానంలో ఉంది. బెంగళూరు 13.. ఢిల్లీ 12.. కోల్ కతా 11 విజయాలతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నాయి.

ఇక ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా 120 కి పైగా పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అత్యంత తక్కువ ఓవర్లు తీసుకున్న జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో హైదరాబాద్ జట్టు లక్నోపై 2024లో 166 పరుగుల టార్గెట్ ఫినిష్ చేయడానికి 9.4 ఓవర్లు తీసుకుంది.

కోల్ కతా పై 125 పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేయడానికి పంజాబ్ జట్టు 11.1 ఓవర్లను తీసుకుంది. 2018లో ఈ మ్యాచ్ జరిగింది.

ముంబై జట్టు విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని దక్కన్ చార్జెస్ కేవలం 12 ఓవర్లలోనే పూర్తి చేసింది. 2008లో డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

2026లో గౌహతివేదికగా చెన్నై జట్టు విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. బంతుల పరంగా రాజస్థాన్ రాయల్స్ కు ఇది అతి పెద్ద విజయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper