Anil Ravipudi Nagarjuna Movie Story Leak: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం వాళ్లు మాత్రమే స్టార్ హీరోలతో సినిమాలను చేయగలుగుతున్నారు. డిఫరెంట్ సినిమాలను చేయగలిగే దర్శకులు కేవలం మీడియం రేంజ్ హీరోల వరకే పరిమితమవుతున్నారు. ఎలివేషన్స్ తో మ్యాజిక్ చేయగలిగే వాళ్ళకే స్టార్ హీరోలు ఆఫర్స్ ఇస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి సైతం ఇప్పటివరకు చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను పెట్టి తన పదోవ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన నాగార్జునతో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. నాగార్జునతో ఎలాంటి సబ్జెక్టు చేయాలి అనే విషయం మీద కథలనైతే అనుకున్నాడట. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో నాగర్జునతో ఎంటర్టైనింగ్ గా వెళ్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఇప్పుడు ఉన్నాడట. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున చేసిన ‘సోగ్గాడే చిన్నినాయన’ ఎలాగైతే కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిందో అనిల్ రావిపూడి సైతం నాగార్జునతో అలాంటి ఒక డిఫరెంట్ సినిమాని ట్రై చేయాలని చూస్తున్నారట…
గోదావరి ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి జీవితంలోకి అమ్మాయిలు వస్తే ఆ ఇద్దరమ్మాయిల మధ్య ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సైతం ఇప్పుడు నడిపిస్తున్నారట. తన దగ్గర ఆల్రెడీ రైటర్ల టీం ఉంది. కాబట్టి ఆ టీం తో ఈ సినిమా మీద కసరతులు చేయిస్తున్నాడు. ఇక ఆయన మాత్రం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో చేయబోతున్న సినిమా కు సంబంధించిన పనులను చూసుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు… నాగార్జున ఒక్కడితో సినిమా చేస్తే సీనియర్ హీరోలు అందరికి సక్సెస్ సాధించి పెట్టిన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకుంటాడు…