Afghanistan: ప్రస్తుతం వరల్డ్ కప్ లో పసికూన గా అడుగుపెట్టి అద్భుతాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని దాటిగా విజయాలను అందుకోవడమే తమ ఊపిరిగా బతుకుతూ, ఎదురుగా ఎంత పెద్ద టీం ఉన్న కూడా భయపడకుండా సవాళ్లను విసురుతూ పోరాటం చేస్తూ సాధ్యమైనంత వరకు గెలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు దూసుకు వస్తున్నా ఏకైక టీమ్ ఆఫ్గనిస్తాన్ టీమ్…వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో ఇంగ్లాండ్, శ్రీలంక లాంటి పెద్ద జట్లు కూడా ఓటమిలను అందుకున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీం మాత్రం విజయాలను అందుకోవడం చూసిన ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న టీం అనుభవం కూడా లేని టీం క్రికెట్ మీద ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మ్యాచ్ లు ఆడుతున్నారు అంటే వాళ్లకి ఎంత డెడికేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ల దేశాన్ని తాలిబన్లు ఆక్రమించిన తర్వాత వాళ్లకు క్రికెట్ ఆడుకోవడానికి కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి లో చిన్న చిన్న సౌకర్యాలను కల్పించుకొని ఉన్న వసతులలోనే క్రికెట్ ని అత్యుత్తమంగా ఎలా ఆడాలి అనే ఉద్దేశ్యం ని నిర్దేశించుకుని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అత్యుత్తమం గా మ్యాచ్ లు ఆడుతూ గెలుస్తూ వస్తున్నారు…
ఆఫ్ఘనిస్తాన్ టీం కి బ్యాటింగ్ ఎలా చేయాలి, బౌలింగ్ ఎలా చేయాలి అని క్రికెట్ లో ఓనమాలు నేర్పింది మాత్రం పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు అయిన ఇంజమాముల్ హక్, ఉమ్రాన్ గుల్ లాంటి ప్లేయర్లు అనే చెప్పాలి అలా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి శిక్షణను ఇవ్వడం జరిగింది… అలా చిన్నగా మొదలుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఇప్పుడు వరల్డ్ కప్ లో పెద్ద జట్లను సైతం వణికిస్తున్నారు… ఇక పాకిస్తాన్ వీళ్ళకి క్రికెట్ పరంగా కొద్దిపాటి శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వీళ్లు ఆడుతున్న మ్యాచ్ లను బట్టి వీళ్ళకి ఇండియా నుంచి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా 2021 లో తాలిబన్లు వీళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవడంతో వాళ్లకు క్రికెట్ ఆడడానికి కనీస సౌకర్యాలను కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం వాళ్లకి క్రికెట్ ఆడడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించింది. అప్ఘనిస్తాన్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా లేదు. దీంతో భారత్ తన సొంత ఖర్చులతో ఆ దేశంలో ఒక భారీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని కట్టి ఇచ్చింది. మంచి సౌకర్యాలను అందులో కల్పించింది. అదే అక్కడ యువత క్రికెట్ లో రాటుదేలడానికి కారణమైంది. ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడడానికి వాళ్లకు ఒక గ్రౌండ్ ని ఉచితంగా కానుకగా ఇచ్చింది.ఇక బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనూ తొలి నాళ్లలోనే అప్ఘనిస్తాన్ క్రీడాకారులకు శిక్షణ ఇప్పించింది. వారికి కావాల్సిన వసతులను సమకూర్చి ఇండియన్ ప్లేయర్లను ఏ విధంగా అయితే చూసుకుంటారో అఫ్గాన్ ప్లేయర్లను కూడా ఆ విధంగానే చూసుకుంటూ వాళ్లతో మ్యాచులు ఆడేలా చేస్తున్నారు. ఇక అప్ఘనిస్తాన్ ప్లేయర్ల కోసం మన దేశంలోనూ ఒక స్టేడియాన్ని కేటాయించి వారికి అన్ని విధాలా సహకరించింది. అందుకే వీళ్ళ సక్సెస్ లో మాత్రం బీసీసీఐ పాత్ర చాలా ఉందనే చెప్పాలి. వీళ్లు సాధించిన విజయాలకి మన మాజీ ప్లేయర్లు అయిన హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు కూడా డాన్సులు వేస్తూ వాళ్లతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇండియన్ జనాలు మన ఇండియన్ టీం తర్వాత అత్యంత ఎక్కువగా ఇష్టపడే టీమ్ ఆఫ్గనిస్తాన్ టీమ్…
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు కూడా పాకిస్తాన్ వైపు కాకుండా ఇండియా వైఫై ఎక్కువగా మొగ్గు చూపిస్తూ మన ఇండియన్ టీమ్ ని ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఇక వీళ్లు ఇండియన్ టీం ని ఆరాధించడానికి ఇండియన్ అభిమానులు వీళ్లను ఆరాధించడానికి ముఖ్య కారణం ఐపిఎల్…ఐపిఎల్ లో రషీద్ ఖాన్ తనదైన మార్కు చూపిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా ఇండియన్ అభిమానులలో కూడా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఇక ఈ సంవత్సరం వీళ్లాడుతున్న ఆట తీరును బట్టి చూస్తే ఈ సంవత్సరం ఐపీఎల్ లో అఫ్గాన్ ప్లేయర్లు చాలా ఎక్కువమంది ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి…