Star Cricketer Photo Story: ఈ ఫొటోలో ఓ బుడ్డోడు ఒకప్పటి టీమిండియా సీమర్ ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా పతకం అందుకుంటున్నాడు. ఈ బుడ్డోడిని నిశితంగా పరిశీలించండి.. యస్.. మీరు అనుకుంటున్నది నిజమే.. ఆ బుడ్డోడనే నేడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. బహుశా 22 ఏళ్ల క్రితం నాటిది ఈ ఫొటో.
నాడు స్కూల్ క్రికెట్లో..
కోహ్లీ చిన్నతనంలో క్రికెట్ టోర్నీలో సత్తా చాటాడు. అప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్‌గా ఉన్న ఆశిష్ నెహ్రా.. ఈ టోర్నీ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీకి మెడల్ అందించాడు. నాడు తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఆశిష్ టీమిండియాకు ప్రాతినిధ్య వహిస్తున్న సమయంలోనే విరాట్ టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. ఆశిష్‌తో కలిసి ఆడాడు. వికెట్లు తీసినప్పుడు ఆశిష్‌ను ఎత్తుకుని ఎంజాయ్ చేశాడు.
కోహ్లీ గురించి గొప్పగా..
ఇదిలా ఉంటే.. కోహ్లీ గురించి ఆశిష్ నెహ్రా కూడా ఎంతో గొప్పగా చెప్పాడు. ఈ ఫొటో బహుశా 2001లో దిగింది అనుకుంటా అంటూ వెల్లడించాడు. అయితే ఈ ఫొటో హైలెట్ కావడానికి కారణం నేను కాదని, దానికి కారణం కోహ్లీ అని కోహ్లీ గురించి గొప్పగా చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా స్టార్‌గా ఉన్నాడని, అతడి కారణంగా నేను గొప్పగా కీర్తించబడుతున్నానని వెల్లడించాడు. మంచి భవిష్యత్ ఉన్న క్రికెటర్ కోహ్లీ అని కీర్తించాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఇదిలా ఉండగా ఈ పాత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలబుగ్గల పిల్లవాడిలా కోహ్లీని చూసి అందరూ సూపర్ హీరో, సూపర్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తను బహుమతి అందుకున్న కోహ్లీ అతడితోనే క్రికెట్ ఆడడం చాలా గ్రేట్ అంటున్నారు.