Homeక్రీడలుక్రికెట్‌SRH vs PBKS match: కాటేరమ్మ కొడుకుల విధ్వంసం ఇలా ఉంటుంది.. ముల్లాన్ పూర్ మోతెక్కి...

SRH vs PBKS match: కాటేరమ్మ కొడుకుల విధ్వంసం ఇలా ఉంటుంది.. ముల్లాన్ పూర్ మోతెక్కి పోయింది..

SRH vs PBKS match: చుట్టూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. బిజినెస్ మాన్ సినిమాలో ఈ డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఈ మాటను సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad) ఆటగాళ్లు నిజం చేసి చూపిస్తున్నారు.. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs PBKS) జట్టులో అభిషేక్ శర్మ (Abhishek Sharma), ట్రావిస్ హెడ్ (Travis head) కీలకమైన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. వీరిద్దరినీ హైదరాబాద్ అభిమానులు కాటేరమ్మ కొడుకులు అని పిలుస్తుంటారు. పి ఐ పీ ఎల్ లో ఇప్పటివరకు వీరిద్దరూ తమ స్థాయిలో ఆడ లేక పోయారు. అయితే శనివారం పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మాత్రం దుమ్మురేపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముల్లాన్ పూర్ మైదానాన్ని మోతిక్కించారు. పవర్ ప్లే లో హైయెస్ట్ స్కోర్ చేసి.. తమ సత్తా ఏమిటో చూపించారు.

ఈ మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అది ఎంత తప్పుడు నిర్ణయమో.. పంజాబ్ జట్టు సారధి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కు కొద్ది ఓవర్ల లోనే తెలిసిపోయింది.. తొలి ఓవర్ ఆర్ష్ దీప్ సింగ్ వేశాడు. ఆ ఓవర్ లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తర్వాత ఓవర్ నుంచి హైదరాబాద్ జట్టు వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ముఖ్యంగా అభిషేక్ శర్మ నెవెర్ బిఫోర్ అన్నట్టుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. పంజాబ్ జట్టు మీద గతంలో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఏకంగా 144 పరుగులు చేసి అప్పట్లో అతడు సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మళ్లీ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇంతవరకు తన స్థాయి ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ ఆడలేదు. అభిషేక్ మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. పంజాబ్ జట్టు మీద తన ఉగ్రరూపాన్ని చూపించాడు. అభిషేక్ దూకుడు వల్ల తొలి రెండు ఓవర్లలో 20 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అంతేకాదు అభిషేక్ శర్మ కేవలం 18 బంతులు మాత్రమే ఎదుర్కొని.. హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో నాలుగు అతి భారీ సిక్సర్లు ఉన్నాయి. బార్ట్ లెట్ బౌలింగ్ లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం ఈ మ్యాచ్లో ఓ హైలెట్.

పవర్ ప్లే లో అత్యధిక వేగంగా పరుగులు సాధించడం హైదరాబాద్ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 ఓవర్ల వ్యవధిలోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సంచలనం సృష్టించింది. 2024 లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 ఓవర్ల లోపు 125, 2024లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 107, ముల్లాన్పూర్ వేదికగా 2026లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 105, 2017లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ కోల్ కతా 105, 2014లో ముంబై వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై 100/2 పరుగులు చేశాయి.

ఈ మ్యాచ్లో 8 సిక్సర్లు కొట్టి అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు.. 2008లో ముంబై జట్టు తరఫున ఆడిన జయసూర్య చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 సిక్సర్లు కొట్టాడు. 2018లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్, 2022లో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో, 2026 ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ 8 సిక్సర్లు కొట్టారు. ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. ఐదు ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టి 74 పరుగులు చేశాడు.. తొలి వికెట్ కు 8.1 ఓవర్లలో 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి వికెట్ గా హెడ్(38), రెండవ వికెట్ గా అభిషేక్ శర్మ (74) వెను తిరిగారు. వీరిద్దరు కూడా శశాంక్ సింగ్ బౌలింగ్లో అవుట్ కావడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper