Homeక్రీడలుFIFA World Cup Final: తొలి 90 నిమిషాలు గోల్ లేదు..ఎక్స్ ట్రా టైం.. సబ్స్టిట్యూట్...

FIFA World Cup Final: తొలి 90 నిమిషాలు గోల్ లేదు..ఎక్స్ ట్రా టైం.. సబ్స్టిట్యూట్ ప్లేయర్.. స్పెయిన్ కథను మార్చాడు..

FIFA World Cup Final: అనుకున్నట్టుగానే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది. రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. ప్లేయర్లు మైదానంలో పాదరసం మాదిరిగా కదిలారు. ఒకరి గోల్ పోస్ట్ మీద మరొకరు దాడి చేసుకున్నారు. అయితే బలమైన ఫీల్డింగ్ వ్యవస్థ వల్ల గోల్ సాధ్యం కాలేదు. మ్యాచ్ ప్రారంభమైన 90 నిమిషాల వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫిఫా నిబంధనల ప్రకారం తొలి 90 […]

FIFA World Cup Final: అనుకున్నట్టుగానే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది. రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. ప్లేయర్లు మైదానంలో పాదరసం మాదిరిగా కదిలారు. ఒకరి గోల్ పోస్ట్ మీద మరొకరు దాడి చేసుకున్నారు. అయితే బలమైన ఫీల్డింగ్ వ్యవస్థ వల్ల గోల్ సాధ్యం కాలేదు. మ్యాచ్ ప్రారంభమైన 90 నిమిషాల వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫిఫా నిబంధనల ప్రకారం తొలి 90 నిమిషాలు ఒక్క గోల్ కూడా నమోదు కాకపోతే.. అదనపు సమయం కేటాయిస్తారు.

అదనపు సమయంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ గోల్ చేశాడు. ఆట 106వ నిమిషంలో అతడు ఈ అద్భుతాన్ని సృష్టించాడు. దీంతో స్పెయిన్ ఒక్కసారిగా లీడ్ లోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రత్యర్థి మీద పట్టు సాధించడానికి అర్జెంటీనా చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. దీనికి తోడు అర్జెంటీనా ఆటగాడికి ఎరుపు కార్డు జారీ అయింది. దీంతో పదిమందితోనే ఆడాల్సి వచ్చింది.

మిడ్ ఫీల్డ్ మీద స్పెయిన్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆట మొదలైన దగ్గర్నుంచి చివరి వరకు స్పెయిన్ మిడ్ ఫీల్డర్లు బంతిని 68% పైగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు.. మ్యాచ్ మొత్తాన్ని శాసించారు.

స్పెయిన్ ప్లేయర్లు అర్జెంటీనా గోల్ పోస్ట్ ను టార్గెట్ చేసుకున్నారు. ఏకంగా 20 షాట్లు కొట్టారు. దీంతో అర్జెంటీనా ప్లేయర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఇందులో 11 షాట్లు అన్ టార్గెట్ కావడం విశేషం. స్పెయిన్ జట్టులోకి సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఫెర్రాన్ మ్యాచ్ అదనపు సమయం 106వ నిమిషంలో గోల్ చేసి స్ప్రేయిన్ జట్టును గెలిపించాడు.

ఫైనల్ మ్యాచ్ కావడంతో అర్జెంటీనా ప్లేయర్లు దూకుడు మంత్రాన్ని కొనసాగించారు. వాస్తవానికి ఇదే సమయంలో అనేక తప్పులు చేశారు. ఆ తప్పులే అర్జెంటీనా కొంప ముంచాయి. ఇదే సమయంలో స్పెయిన్ ప్లేయర్లు హుందాతనాన్ని కొనసాగించారు. ఒత్తిడిని తట్టుకుంటూ.. సమర్థవంతంగా బంతిని పాస్ చేయగలిగారు. అందువల్లే అర్జెంటినా ప్లేయర్లకు అవకాశం లేకుండా పోయింది.. స్పెయిన్ మాదిరిగానే అర్జెంటీనా ప్లేయర్లు గనుక ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకొక విధంగా ఉండేది.. అంతమంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒక్క గోల్ కూడా సాధించలేకపోవడం విశేషం. మెస్సి లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓడిపోవడం అర్జెంటీనా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. సమిష్టి తత్వాన్ని కొనసాగించిన స్పెయిన్ విజయం సాధిస్తే.. కేవలం మెస్సి మ్యాజిక్ ను మాత్రమే అందుకున్న అర్జెంటీనా ఓడిపోయింది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper