Homeక్రీడలుక్రికెట్‌JP DUMINI : మాజీ క్రికెటర్ విడాకులు.. భార్యకు భరణం ఎంత ఇచ్చాడో తెలుసా..

JP DUMINI : మాజీ క్రికెటర్ విడాకులు.. భార్యకు భరణం ఎంత ఇచ్చాడో తెలుసా..

JP DUMINI : క్రికెట్ రంగంలో హార్దిక్ పాండ్యా, వీరేంద్ర సెహ్వాగ్ తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో యజువేంద్ర చాహల్ కూడా చేరిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఇక మన దేశాన్ని పక్కన పెడితే.. దక్షిణాఫ్రికా దేశాన్ని చెందిన మాజీ క్రికెటర్ జెపి డుమిని ( South Africa ex cricketer JP DUMINI) తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డుమినికి 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతడికి ఇద్దరు కుమార్తెలు. అయితే ఇన్ని సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత తాము విడిపోతున్నట్టు డుమిని సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు..” ఇది చాలా బాధాకరమైన విషయం. 14 సంవత్సరాల తర్వాత ఒక మనిషికి దూరంగా వెళ్తుండడం ఇబ్బంది కలిగించే పరిణామం. అన్నీ ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. భార్యాభర్తలు గా మేమిద్దరం విడిపోయినప్పటికీ.. మా ఇద్దరు కుమార్తెల బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తిస్తాం. కోర్టు నిర్ణయం ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు ఆమె తల్లి దగ్గరే ఉంటారు. వారి ఆలనా పాలనా నేను చూసుకుంటానని” డుమిని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా జట్టు తరపున జెపి డుమిని 46 టెస్టులలో ఆడాడు. 199 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. 81 టీ 20లలో ఆడాడు. 83 ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆడాడు.  దక్షిణాఫ్రికాలో డుమినికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
అభిమానులకు షాక్ 
డుమిని తన భార్యతో విడాకులు తీసుకోవడంతో దక్షిణాఫ్రికా అభిమానులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు.. ఎందుకంటే డుమిని చాలా సౌమ్యుడు. వివాద రహితుడు. అతడిని దక్షిణాఫ్రికా అభిమానులు విపరీతంగా ప్రేమిస్తారు. అతడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో ఆ వీడియోలు సంచలనం సృష్టించాయి. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన భార్యకు భరణంగా డుమిని భారీగానే చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ” అతడు ఒక్కసారిగా తన విడాకుల వార్తను ప్రకటించి సంచలనం సృష్టించాడు. భరణంగా భారీగానే చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి.. కోట్లలోనే ఆ చెల్లింపులు ఉన్నాయని.. ఇతర కుమార్తెల బాగోగుల కోసం డుమిని భారీగానే తన భార్యకు ఇచ్చినట్టు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకే డుమిని నడుచుకున్నాడు. కాకపోతే డుమిని లాంటి వ్యక్తి విడాకులు తీసుకోవడం అతని అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. దీనిపై డుమిని వివరణ ఇచ్చినప్పటికీ వారిలో ఆగ్రహం చల్లారడం లేదు. విడాకులు తీసుకునే ముందు డుమిని దంపతులు మరి కొంతసేపు ఆలోచించుకొని ఉంటే బాగుండేది.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడిందని” సౌత్ ఆఫ్రికా మీడియా వ్యాఖ్యానించింది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular