Homeక్రీడలుPreity Zinta IPL success: ప్రీతి జింటా 26.75 కోట్లకు న్యాయం జరిగింది.. పాపం సంజీవ్...

Preity Zinta IPL success: ప్రీతి జింటా 26.75 కోట్లకు న్యాయం జరిగింది.. పాపం సంజీవ్ గోయంకా 27 కోట్లే ఎటూ కాకుండా పోయాయి

Preity Zinta IPL success: ఆడవాళ్లు ప్రతి పైసా ను జాగ్రత్తగా ఖర్చు పెడతారు. పెట్టిన ప్రతి పైసను సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్లకు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి.. దేనికి ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం పూర్తిగా తెలుసు. ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడి పుట్టింది. మగవాళ్లకు సంపాదించడం తెలుసు. ఖర్చుపెట్టడం కూడా తెలుసు. కాకపోతే పెడుతున్న ఖర్చు ఎంత మేరకు సద్వినియోగం అవుతోందనే విషయం మాత్రం మగవాళ్ళకు తెలియదు. అందువల్లే ఆర్థిక పాఠాలను ఆడవాళ్ళ నుంచి నేర్చుకోవాలి అని చెబుతారు.

2024లో ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపాడు అయ్యర్. అయితే అతడిని నిలుపుకోవడంలో షారుక్ ఖాన్ నిర్లక్ష్యం వహించాడు. మేనేజ్మెంట్ ధోరణి సరిగా లేకపోవడంతో అయ్యర్ బయటకు వచ్చాడు. అయ్యర్ ను ప్రీతి జింటా మెగా వేలంలో ఇష్టపడి కొనుగోలు చేసింది. ఏకంగా 26.75 కోట్లు అతడి కోసం చెల్లించింది. ప్రీతి జింటా ఆ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని విలేకరులు అడిగితే.. అయ్యర్ పైసా వసూల్ ఆటగాడు అంటూ ఏకవాక్యంలో సమాధానం చెప్పింది. ప్రీతి జింటా ఆ స్థాయిలో డబ్బు చెల్లించడం వల్ల పంజాబ్ జట్టు విలువ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది పంజాబ్ ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. దురదృష్టవశాత్తు ట్రోఫీని అందుకోలేకపోయింది.

ఈ సీజన్లో పంజాబ్ జట్టు దుమ్ము రేపుతోంది. ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఆ జట్టు ఖాతాలో లేదు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా దూకుడు తత్వాన్ని.. ఆలోచన పూరితమైన ఆట విధానాన్ని కొనసాగిస్తూ అదరగొడుతోంది. అందువల్లే పంజాబ్ తిరుగులేని స్థాయిలో ఉంది. పంజాబ్ ఆట తీరు చూసి ఆ జట్టు యజమాని ప్రీతి జింటా ఆనంద పడుతోంది.

2024 మెగా వేలంలో రిషబ్ పంత్ ను 27 కోట్లకు లక్నో యాజమాన్యం కొనుగోలు చేసింది. అతడి నాయకత్వంలో జట్టు గొప్పగా ఆడుతుందని చెప్పుకుంది. కానీ ఇంతవరకు ఆ 27 కోట్లకు న్యాయం జరగలేదు. ఇప్పటికి లక్నో యజమాని సంజీవ్ బాధపడుతూనే ఉంటాడు. బాధపడుతూనే ఉన్నాడు. 27 కోట్ల ఆటగాడు అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

చుక్క తెగిపడ్డట్టు ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా సందర్భాల్లో విఫలమవుతున్నాడు. ఇలాంటి ఆట తీరు కొనసాగిస్తున్న పంత్ ను చూసి సంజీవ్ గోయాంక బాధపడని రోజు లేదు. కానీ, 27 కోట్లు పెట్టిన తర్వాత ఉపయోగం లేదు. అందుకే సంజీవ్ బయటికి నవ్వుతున్నాడు. కానీ లోపల మాత్రం అంతులేని ఆవేదన ఉంది. సంజీవ్ తో పోల్చి చూస్తే 25 లక్షలు తక్కువ ఖర్చుపెట్టిన ప్రీతి జింటా.. అంతకు మించిన 100 రెట్ల విలువను పెంచుకొని దర్జా అనుభవిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular