HomeతెలంగాణHyderabad Middle Class: హైదరాబాదులో మిడిల్ క్లాస్ కష్టాలు.. మటన్ కూడా కొనలేని దరిద్రం..

Hyderabad Middle Class: హైదరాబాదులో మిడిల్ క్లాస్ కష్టాలు.. మటన్ కూడా కొనలేని దరిద్రం..

Hyderabad Middle Class: ఒకటో తారీకు జీతం వస్తుంది. ఆ తర్వాత ఈఎంఐ కట్టాలి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి.. ఇంటి రెంట్ కట్టాలి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. నెలవారి ఖర్చుకు ఎంతోకొంత ఎకౌంట్లో ఉంచుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏం మిగులుతుంది.. జీతం ఆవగింజంత ఉంటే.. ఖర్చులు మామిడికాయ సైజులో ఉంది. ఇలాంటప్పుడు నాలుగు రాళ్లు వెనక వేయడం కాదు కదా.. కనీసం జీవితాన్ని ముందుకు సాగించడం కూడా కష్టమే. నచ్చినవి తినలేము. ఇష్టమైన […]

Hyderabad Middle Class: ఒకటో తారీకు జీతం వస్తుంది. ఆ తర్వాత ఈఎంఐ కట్టాలి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి.. ఇంటి రెంట్ కట్టాలి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. నెలవారి ఖర్చుకు ఎంతోకొంత ఎకౌంట్లో ఉంచుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏం మిగులుతుంది..

జీతం ఆవగింజంత ఉంటే.. ఖర్చులు మామిడికాయ సైజులో ఉంది. ఇలాంటప్పుడు నాలుగు రాళ్లు వెనక వేయడం కాదు కదా.. కనీసం జీవితాన్ని ముందుకు సాగించడం కూడా కష్టమే. నచ్చినవి తినలేము. ఇష్టమైన వాటిని కొనుగోలు చేయలేము. బాగున్న వాటిని సొంతం చేసుకోలేము. ఊహల్లో బతకడం.. కష్టాలను తిట్టుకోవడం.. ఇదే మిడిల్ క్లాస్ జీవితం..

మనదేశంలో పేదవాళ్లు ఒక అంచనాలో బతుకుతారు. డబ్బున్న వాళ్లు కూడా ఒక అంచనాలో బతుకుతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటువంటి అంచనా వేసుకోలేరు. ఎందుకంటే వాళ్లకు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని.. ముందుగానే జాగ్రత్త పడతారు. జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన ఖర్చులు ఆగవు కదా.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీవించే మిడిల్ క్లాస్ వాళ్లకు ప్రతిరోజు ఒక పజిల్ మాదిరిగానే ఉంటుంది. అక్కడ జీవించే మిడిల్ క్లాస్ ప్రజల కష్టాల మీద ఒక వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఈఎంఐ.. కిరాయిలు.. కుటుంబ ఖర్చులు.. వీటన్నింటికీ జీతం సరిపోక కనీసం మటన్ కూడా కొనుగోలు చేయడం కష్టమవుతుంది. జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా.. పెళ్లి జరిగిన తర్వాత.. పిల్లలు పుట్టిన తర్వాత.. వారి బాధ్యతలతోనే జీవితం సంకనాకి పోతుందని.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్పాడు. ఈ వీడియోను చాలామంది తమకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. తమది కూడా ఇటువంటి దుస్థితేనని వాపోతున్నారు. మా మనసులో ఉన్న బాధను మొత్తం వ్యక్తం చేశావని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

గతంతో పోల్చి చూస్తే హైదరాబాద్ నగరంలో మిడిల్ క్లాస్ వల్ల కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని ఖర్చులు పెరిగిపోవడం.. వాటికి తగ్గట్టుగా వేతనాలు పెరగపోవడంతో చాలామంది ఆర్థికంగా కష్టాలు పడుతూనే ఉన్నారు. పెళ్లి.. పిల్లలు.. బాధ్యతలు.. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కాబట్టి.. చాలామంది కష్టాలను పంటి కింద భరిస్తూ.. తమ ఇబ్బందులను తిట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటారు. ఎందుకంటే అంతకుమించి చేయడానికి మిడిల్ క్లాస్ వాళ్లకు అవకాశం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper