Homeక్రీడలుక్రికెట్‌Lucknow vs KKR: పంత్ ముంచేసినా.. ముకుల్ మార్చేశాడు.. మామూలు ఉత్కంఠ కాదిది

Lucknow vs KKR: పంత్ ముంచేసినా.. ముకుల్ మార్చేశాడు.. మామూలు ఉత్కంఠ కాదిది

Lucknow vs KKR: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఉత్కంఠ కలిగించిన మ్యాచులు ఎన్నో జరిగాయి. అందులో గురువారం లక్నో, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే గెలుపు సమీకరణం అంతకంతకూ మారింది. ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. చూస్తున్న ప్రేక్షకులకు క్రికెట్ మజా అందించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో మూడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ […]

Lucknow vs KKR: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఉత్కంఠ కలిగించిన మ్యాచులు ఎన్నో జరిగాయి. అందులో గురువారం లక్నో, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే గెలుపు సమీకరణం అంతకంతకూ మారింది. ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. చూస్తున్న ప్రేక్షకులకు క్రికెట్ మజా అందించింది.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో మూడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన షారుక్ ఖాన్ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను చేజ్ చేయడంలో లక్నో జట్టు ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్నో జట్టును ముకుల్ చౌదరి ఆదుకున్నాడు. 27 బంతుల్లో 54* పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కోల్ కతా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. మూడు ఓటములు ఎదుర్కొంది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో కోల్ కతా జట్టుకు ఒక పాయింట్ లభించింది.

అక్కడే మ్యాజిక్ జరిగింది

లక్నో జట్టు గెలుపుకు చివరి ఓవర్ లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆవేష్ ఖాన్ తొలి బంతికి సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బంతికి ముకుల్ సిక్సర్ కొట్టాడు. అప్పటికి లక్నో జట్టు విజయ సమీకరణం నాలుగు బంతుల్లో ఏడు పరుగులకు చేరుకుంది. మూడు, నాలుగో బంతికి పరుగులు రాలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. దీంతో రెండు ఏడు పరుగులుగా మారిపోయింది.. అయితే ఐదో సిక్సర్ కొట్టాడు. దీంతో రెండు జట్ల పరుగులు సమానమయ్యాయి. చివరి బంతిని షాట్ కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ.. బై రూపంలో ఒక పరుగు తీయడంతో లక్నో జట్టు విజయం సాధించింది.

అంతకుముందు కోల్ కతా జట్టు బాటర్లలో రహానే 41, రఘు వంశీ 45, పావెల్ 39, గ్రీన్ 32 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్, దిగ్విష్, ఆవేష్ తలా ఒక వికెట్ సాధించారు. చేజింగ్ సమయంలో లక్నో జట్టు కెప్టెన్ పంత్ విఫలమైనప్పటికీ.. కీలక దశలో బదోని అవుట్ అయినప్పటికీ.. ముకుల్ సత్తా చూపించాడు. ఆ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటూ.. దూకుడుగా బ్యాటింగ్ చేసి.. లక్నో జట్టును గెలిపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper