Homeఎంటర్టైన్మెంట్Dacoit Movie Twitter Review: 'డెకాయిట్' ట్విట్టర్ టాక్ ఇదే.. అడివి శేష్ నుండి ఇలాంటి...

Dacoit Movie Twitter Review: ‘డెకాయిట్’ ట్విట్టర్ టాక్ ఇదే.. అడివి శేష్ నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు భయ్యా..

Dacoit Movie Twitter Review: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అడివి శేష్ సినిమా అంటే యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎవ్వరూ ఊహించని ట్విస్టులు, అద్భుతమైన స్క్రీన్ ప్లే వంటివి ఆయన సినిమాల్లో చాలా కామన్. మనం పెట్టే టికెట్ రేట్ కి నూటికి నూరు శాతం న్యాయం […]

Dacoit Movie Twitter Review: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అడివి శేష్ సినిమా అంటే యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎవ్వరూ ఊహించని ట్విస్టులు, అద్భుతమైన స్క్రీన్ ప్లే వంటివి ఆయన సినిమాల్లో చాలా కామన్. మనం పెట్టే టికెట్ రేట్ కి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని ఇస్తాడు అడివి శేష్. అందుకే ఇంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ‘డెకాయిట్’ చిత్రానికి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అలా మంచి పాజిటివ్ బజ్ తో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో ఈ ట్విట్టర్ రివ్యూస్ ద్వారా చూద్దాం.

ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మొదటి 30 నిముషాలు చాలా ఫ్లాట్ గా ఉంటుంది అట, లవ్ సన్నివేశాలు గొప్పగా లేవట, సాంగ్ కూడా బాలేదట. కానీ మొదటి 30 నిమిషాల తర్వాత సినిమా స్క్రీన్ ప్లే లో వేగం అందుకుంటుందట, కొన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. ఎడిటింగ్ అడివి శేష్ గత సినిమాలా మాదిరిగానే ఉందని టాక్. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుందని అంటున్నారు నెటిజెన్స్. టెక్నీకల్ కూడా అద్భుతంగా ఉందట. అంతా బాగానే ఉంది కానీ , ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండడం అవసరం. అక్కడే ఈ చిత్రం తేడా కొట్టిందని అంటున్నారు. కొన్ని సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ గా అనిపించాయట, కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం అవసరం లేదని అనిపించిందట. అడివి శేష్ సినిమాల్లో బుర్ర బ్లాస్ట్ అయ్యే ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఈ చిత్రం లో కూడా అలాంటి ట్విస్టులు ఉన్నాయట కానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది.

సెకండ్ హాఫ్ లోని అనేక సన్నివేశాలు క్షణం/ గూఢచారి వంటి చిత్రాలను చూసి కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ తో ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు , అది చాలా టూ మచ్ అనిపించిందట. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీ అని అంటున్నారు నెటిజెన్స్. ఇక నటీనటుల విషయానికి వస్తే, అడివి శేష్ చాలా చక్కగా నటించాడట. ఈ చిత్రం లో ఆయన రాయలసీమ యాస తో మాట్లాడుతాడట, కానీ ఇంకా బెటర్ గా మాట్లాడి ఉండుంటే బాగుండేదని అంటున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో దంచి కొట్టేసిందట. ఓవరాల్ గా భారీ అంచనాలు పెట్టుకోకుండా, తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సినిమాని చూస్తే కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper