spot_img
Homeక్రీడలుక్రికెట్‌Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఉపద్రవం.. బాబర్ ఆజామ్ ను గెంటేయడమే తరువాయి..

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఉపద్రవం.. బాబర్ ఆజామ్ ను గెంటేయడమే తరువాయి..

Pakistan: అనిశ్చితి కి పాకిస్తాన్ క్రికెట్ మారుపేరు. అందువల్లే ఆ జట్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. ఎప్పుడు ఏ ఆటగాడు ఎలా ఆడతాడో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ క్రికెట్లో ఒక పద్ధతి అంటూ ఉండదు. ఒక విధానం అంటూ ఉండదు. ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ల లో వారే కొట్టుకుంటారు. పైకి మాత్రం గొప్పగా ఉన్నట్టు నటిస్తుంటారు.

ప్రస్తుతం పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచింది. అది కూడా అతి కష్టం మీద విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు గురించి చర్చ మొదలైంది. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ జట్టులో ఒక ఉపద్రవం ఏర్పడిందని తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజామ్ మీద వేటువేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ” కెప్టెన్ సల్మాన్ ఈసారి ఆ గ్రహంగా కనిపిస్తున్నాడు. ఎందుకో తెలియదు ఈసారి పాకిస్తాన్ జట్టును టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలపాలని అతడు బలంగా నిర్ణయించుకున్నాడు. ఇటీవల కాలంలో బాబర్ సరిగ్గా ఆడటం లేదు. అందువల్ల అతడిని పక్కనపెట్టి.. సమర్థవంతమైన ప్లేయర్ ను తీసుకోవాలని భావిస్తున్నాడు. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. వచ్చే రోజుల్లో అదే జరుగుతుందని” పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే జట్టు ప్లేయర్లకు పాకిస్తాన్ కెప్టెన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడక పోతే బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ క్రికెటర్లు సమర్థవంతంగా ఆడాలని.. అప్పుడే వారికి జట్టులో స్థానం ఉంటుందని పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆటగాళ్ల ప్రయోజనాల కంటే జట్టు విజయమే తమకు లక్ష్యమని ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్ అనేక సందర్భాలలో స్పష్టం చేశాడు. అయితే ఈ స్థాయిలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చివరి వరకు పోరాడింది. బౌలింగ్లో పస లేకుండా పోయింది. బ్యాటింగ్లో సత్తా లేకుండా పోయింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు మీద చివరి వరకు చెమట ఓడ్చి పాకిస్తాన్ జట్టు విజయం సాధించాల్సి వచ్చింది. మరోవైపు ఫిబ్రవరి 15న భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో తాము ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు లెటర్ కూడా రాసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ పై సందిగ్ధం ఏర్పడింది. అయితే కొన్ని నేషనల్ మీడియాలలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ జట్టు భారత్ తో మ్యాచ్ ఆడుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper