Homeక్రీడలుక్రికెట్‌Noor Ahmad 3 Wickets Vs Kolkata Knight Riders IPL: నూర్ అహ్మద్...

Noor Ahmad 3 Wickets Vs Kolkata Knight Riders IPL: నూర్ అహ్మద్ మూడు వికెట్ల వెనుక లెజెండరీ ఆటగాడు.. అతని ప్రోత్సాహం వల్లే ఈ ఘనత

Noor Ahmad 3 Wickets Vs Kolkata Knight Riders IPL: వేసింది నాలుగు ఓవర్లు.. ఇచ్చింది 19 పరుగులు.. తీసింది మూడు వికెట్లు.. ఇటువంటి స్పెల్ ఏ బౌలరైనా ఎందుకు కోరుకోడు. ఇటువంటి ఘనతనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ సాధించాడు. మంగళవారం చెన్నైలోనే చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో నూర్ అహ్మద్ ఈ రికార్డు అందుకున్నాడు. పిచ్ నుంచి పేస్ బౌలర్ల […]

Noor Ahmad 3 Wickets Vs Kolkata Knight Riders IPL: వేసింది నాలుగు ఓవర్లు.. ఇచ్చింది 19 పరుగులు.. తీసింది మూడు వికెట్లు.. ఇటువంటి స్పెల్ ఏ బౌలరైనా ఎందుకు కోరుకోడు. ఇటువంటి ఘనతనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ సాధించాడు. మంగళవారం చెన్నైలోనే చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో నూర్ అహ్మద్ ఈ రికార్డు అందుకున్నాడు.

పిచ్ నుంచి పేస్ బౌలర్ల కు పెద్దగా సపోర్ట్ లభించడం లేదు. మొదట్లో బంతి కాస్త స్వింగ్ అయినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.. అందువల్లే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బంతులు వేయగలిగారు. వికెట్లు మాత్రం అంతగా తీయలేకపోయారు. కానీ, చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ మాత్రం అదరగొట్టాడు.. రహానే, రింకూ సింగ్, గ్రీన్ వంటి ప్లేయర్లను తన మాయాజాల భక్తులతో వెనక్కి పంపించాడు. దీంతో ఏ దశలో కూడా కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు దిశగా సాగినట్లు కనిపించలేదు.

193 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 13 పరుగులకే ప్రమాదకరమైన ఓపెనర్ అలెన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సునీల్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన కెప్టెన్ రహనే కాస్త మెరుగ్గా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ.. నూర్ అహ్మద్ బౌలింగ్లో
ఔటయ్యాడు. రింకు సింగ్, గ్రీన్ ఇలా అత్యంత కీలకమైన వికెట్లను తీసి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు నూర్ అహ్మద్.

ఈ మ్యాచ్ కంటే ముందు నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కలిశాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని సలహాలను అహ్మద్ స్వీకరించాడు. బంతి ఎక్కడ వేయాలి.. ఎలా వేస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడు.. అనే అంశాలపై అహ్మద్ కు ధోని చెప్పాడు. వాటిని అదేవిధంగా పాటించాడు నూర్ అహ్మద్. ఫలితంగా సొంత మైదానంలో చెన్నై జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

మూడు వికెట్లు తీసిన నూర్ అహ్మద్ మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఆ తర్వాత తనకు ధోని ఎలా సూచనలు ఇచ్చింది.. వాటిని ఎలా పాటించింది అదే విషయాలను అతడు అంతగా చెప్పకపోయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయి. నూర్ అహ్మద్ లో ప్రతిభను గుర్తించిన ధోని.. వాటికి సానబెట్టడం ద్వారా ఈ స్థాయిలో అతడు సత్తా చాటాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper