Homeక్రీడలుKho Kho World Cup 2025: డబుల్‌ ధమాకా.. రెండు ప్రపంచ కప్‌లు మనవే.. ఖోఖోలో...

Kho Kho World Cup 2025: డబుల్‌ ధమాకా.. రెండు ప్రపంచ కప్‌లు మనవే.. ఖోఖోలో భారత్‌ సరికొత్త రికార్డు!

Kho Kho World Cup 2025: భారత ఖోఖో చరిత్రలో సంచలనం నమోదైంది. భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. నెవ్వర్‌ బిఫోర్‌ అనేలా.. గంటల వ్యవధిలోనే అటు మహిళల టీం.. ఇటు పురుషుల టీం ప్రపంచ ఛాంపియన్లు(World Champions)గా నిలిచాయి. రెండు వరల్డ్‌ కప్‌లను భారత ఖాతాలో వేశాయి. న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుది పోరులు భారత్‌ 54–36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు కూడా అదే జోరును కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్‌ను కట్టడి చేసి విశ్వ విజేతగా నిలిచింది.

తొలి వరల్డ్‌ కప్‌లోనే..
ఖోఖోను విశ్వవ్యాప్తం చేయడానికి భారత్‌ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారి ప్రపంచకకప్‌ పోటీలు నిర్వహిస్తోంది. మొదటిసారి నిర్వహించిన ఖోఖో వరల్డ్‌ కప్‌ పోటీల్లో మహిళలు, పురుషుల ఇద్దరూ ఛాంపియన్‌లుగా నిలవడం విశేషం. ముందు జరిగిన మహిళల ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ విశ్వ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో చెలరేగిపోయిన మహిళల జట్టు.. ఫైనల్‌లోనూ అదే దూకుడుతో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం(జనవరి 19న) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 78–40 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ గెలిచిన నేపాల్‌..
ఈ మ్యాచ్‌లో నేపాల్‌ టాస్‌ గెలిచింది. ముందుగా భారత్‌ను అటాక్‌కు రమ్మని ఆహ్వానిచింది. ఆతిథ్య భారత్‌కు ఇది వరంగా మారింది. నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత ఆటగాళ్లు నేపాల్‌ను వరుస విరామాల్లో ఒత్తిడిలోకి నెట్టారు. ఎక్కడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించారు. ఆట ప్రారంభం నుంచి ముగిసే వరకూ ఒకేరకమైన ఆట తీరుతో నేపాల్‌ను ఓడించింది.

సాయంత్రం పురుషుల మ్యాచ్‌..
ఇక ఆదివారం సాయంత్రం ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో కూడా భారత్‌ నేపాల్‌ తపలడ్డాయి. ఆది నుంచి భారత పురుషుల జట్టు ఆధిప్యం కనబర్చింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండానే విశ్వ విజేతగా నిలిచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper