‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సోమవారం తుల, ధనస్సు రాశులపై శివుడి అనుగ్రహం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి కూడా అనుకూల ప్రయోజనాలు ఉండనున్నాయి. అయితే కొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని విడిచిపెట్టాలి. సోమరితనాన్ని దూరం చేయాలి. అప్పుడే అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ పని మొదలుపెట్టిన ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళితే మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఒకరి వివాహం కోసం ప్రయత్నాలు జరుగుతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు ఉంటుంది. సమాజంలో వీరు గౌరవం పొందుతారు. బంధువులతో ఆర్థిక లావాదేవీలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే సంబంధాల్లో చీలిక ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సోదరుల సహాయంతో కొన్ని కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో ఏదైనా వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. వ్యాపారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. దీంతో అనుకున్న దానికంటే ఖజానా ఎక్కువగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : బ్యాంకు నుంచి రుణాన్ని సులభంగా పొందుతారు. అయితే వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉండవు. దీంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఓ కొత్త ప్రాజెక్టు కోసం సీరియస్ గా పనిచేస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. సోదరీ వివాహం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల పర్వతలతో ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక పర్యటనలు ఎక్కువగా చేస్తారు. ఒకేసారి అన్ని పనులు చేయాల్సి రావడంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా బలపడేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ప్రభుత్వ పనులు అనుకోకుండా వాయిదా పడతాయి. అప్పులు తీర్చడానికి మార్గాలు ఏర్పడతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మనసులో ప్రతికూల ఆలోచనలు విముక్తి చేసుకోవాలి. సాయంత్రం శత్రువులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మాటల్లో మాధుర్యం ఉండడంవల్ల సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు.