Pushpa2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఏ ముహూర్తం లో విడుదలైందో కానీ, ఆ సినిమా థియేట్రికల్ రన్ లో కొట్టని రికార్డు లేదు, క్రియేట్ చేయని రికార్డు లేదు. విడుదలై 44 రోజులు పూర్తి అయ్యింది, ఇప్పటికీ ఈ సినిమాకి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తున్నాయంటే ఎలాంటి సునామీ రన్ అనేది అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ సినిమా బాగుంటే హీరో ఎవరు అనేది చూడరు, ఎవరినైనా ఆదరిస్తారు. కాని బాలీవుడ్ ఆడియన్స్ అంత తేలికగా ఒక సినిమాకి థియేట్రికల్ రన్ ఇవ్వరు. వాళ్లకు తిక్క లేస్తే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాలను కూడా చూడడం మానేస్తారు. అలాంటి ఆడియన్స్ ఉన్న చోట ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన సంఘటన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. కేవలం కలెక్షన్స్ విషయంలోనే కాదు టికెట్ సేల్స్ విషయం లో కూడా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.
అదేమిటంటే హిందీ వెర్షన్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలలో పుష్ప 2 కి ఏకంగా నాలుగు కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలలో ‘గద్దర్ 2 ‘ కి 3 కోట్ల 40 లక్షల టికెట్స్ సేల్ అయితే, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి 3 కోట్ల 10 లక్షల టిక్కెట్లు, పఠాన్ చిత్రానికి 2 కోట్ల 80 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా గత ఏడాది విడుదలైన స్త్రీ 2 చిత్రానికి 3 కోట్ల 20 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయట. 2020 నుండి విడుదలైన సినిమాలలో టాప్ 5 గా నిల్చిన చిత్రాలు ఇవే. వీటిలో పుష్ప 2 చిత్రం టాప్ 1 స్థానం లో గమనార్హం.
బాలీవుడ్ గడ్డ మీద మన తెలుగు హీరో సినిమా నెంబర్ 1 స్థానంలో అటు కలెక్షన్స్ పరంగా, ఇటు టికెట్ సేల్స్ పరంగా నిలబడడం ఎంతో గర్వించదగ్గ విషయం. మళ్ళీ ఇలాంటి ఘనత సాధించాలంటే తెలుగు హీరోల వల్లే అవుతుంది. పుష్ప 2 స్థాయిలో ప్రభంజనం సృష్టించే సత్తా ప్రభాస్ నటిస్తున్న ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘కల్కి 2 ‘ చిత్రాలకు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ‘వార్ 2 ‘, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలకు కూడా ఇలాంటి అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. వీటి తర్వాత మరో మూడేళ్ళలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి ఇండియన్ సినిమాలతో పోటీ కాదు, కేవలం హాలీవుడ్ సినిమాలతోనే పోటీ. ఆ స్థాయిలో మన తెలుగు సినిమా సత్తా ప్రపంచం మొత్తం ఏలనుంది. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.