Homeక్రీడలుక్రికెట్‌Ajinkya Rahane Captaincy: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త కెప్టెన్ ఇతడు.. షారూక్ ఖాన్ అంత గుడ్డిగా...

Ajinkya Rahane Captaincy: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త కెప్టెన్ ఇతడు.. షారూక్ ఖాన్ అంత గుడ్డిగా ఎలా నమ్మాడు

Ajinkya Rahane Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆయా జట్లకు సారధ్యం వహించే కెప్టెన్లకు ఒక రేంజ్ ఉంటుంది. 2008లో మొదలైన ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎంతో మంది కెప్టెన్లు తమ జట్లకు నాయకత్వం వహించారు. కొంతమంది జట్లు మారారు. అయినప్పటికీ నాయకత్వ బాధ్యతలో ఉన్నప్పుడు సత్తా చూపించారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా అనేక విషయాలలో అదరగొట్టారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక చెత్త కెప్టెన్ గురించి ఈ కథనంలో ఇప్పుడు మనం […]

Ajinkya Rahane Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆయా జట్లకు సారధ్యం వహించే కెప్టెన్లకు ఒక రేంజ్ ఉంటుంది. 2008లో మొదలైన ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎంతో మంది కెప్టెన్లు తమ జట్లకు నాయకత్వం వహించారు. కొంతమంది జట్లు మారారు. అయినప్పటికీ నాయకత్వ బాధ్యతలో ఉన్నప్పుడు సత్తా చూపించారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా అనేక విషయాలలో అదరగొట్టారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక చెత్త కెప్టెన్ గురించి ఈ కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఐపీఎల్ లో 10 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈసారి అన్ని జట్లకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ జట్లల్లో కోల్ కతా నైట్ రైడర్స్ కు సారధిగా ఉన్న అజింక్యా రహనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత ఐపిఎల్ లో అతడు అత్యంత తక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న నాయకుడిగా చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 25కు మించి మ్యాచులకు నాయకత్వం వహించినప్పటికీ.. కేవలం 31.8% విన్నింగ్ పర్సంటేజ్ తో విఫల సారధిగా కొనసాగుతున్నాడు. ఇతడు 44 మ్యాచ్లకు సారధ్య బాధ్యత వహించాడు. 14 సార్లు మాత్రమే తమ జట్టును గెలిపించాడు. ఇతడి తర్వాత స్థానంలో జయవర్ధనే 33.3, సంగక్కర 36.2, ధవన్ 37, గంగూలీ 40.5 విజయాల శాతంతో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత సీజన్లో రహనే నాయకత్వంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడింది. ఐదింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

రహనే మైదానంలో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. బౌలింగ్ కూర్పు విషయంలో అతని అంచనాలు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో అతనికి అర్థం కావడం లేదు.. స్పిన్ బౌలర్ల విషయంలో కూడా అతని అంచనాలు వాస్తవ రూపం దాల్చడం లేదు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ అనామక జట్టుగా మిగిలిపోతుంది. 2024 లో ట్రోఫీ గెలిచిన తర్వాత.. అయ్యర్ పంజాబ్ జట్టుకు వెళ్లిపోయాడు.. అతడు పంజాబ్ జట్టుకు వెళ్లిపోయిన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ పరిస్థితి మారిపోయింది. గత ఏడాది అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది. రహానే సారధ్యంలో కోల్ కతా అన్ని విభాగాలలో విఫలమైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో విఫల ప్రదర్శన చేస్తోంది.

రహనే ఇంత దారుణంగా ఆడుతున్న నేపథ్యంలో షారుక్ ఖాన్ అతడిని అంత గుడ్డిగా ఎలా నమ్మాడని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తమ జట్టు విషయంలో షారుక్ ఖాన్ అన్ని విషయాలను కూలంకశంగా పరిశీలిస్తాడు. మరి రహనే విషయంలో షారుక్ ఖాన్ అంచనా ఎందుకు తప్పయింది.. ఎవరి మాటలు విని అతడు మోసపోయాడు.. జట్టు ఇలా నాశనం అవుతుంటే.. చూస్తూ ఎలా ఉండిపోతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper