Homeక్రీడలుక్రికెట్‌Lalit Modi: ఐపీఎల్ రేటింగ్స్ పెంచడానికి ఆ పనులు చేసేవాళ్లం.. అసలు నిజం బయటపెట్టిన లలిత్...

Lalit Modi: ఐపీఎల్ రేటింగ్స్ పెంచడానికి ఆ పనులు చేసేవాళ్లం.. అసలు నిజం బయటపెట్టిన లలిత్ మోడీ

Lalit Modi: ఐపీఎల్ జరుగుతున్నప్పుడు.. మైదానంలో కంటే మైదానం వెలుపల రకరకాల వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. ఇవి బయటపడినప్పుడు మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటి మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదో జరుగుతోంది.. ఇంకా ఏదో ఉంది అన్న చర్చ నడుస్తుంది. అప్పుడు ఐపీఎల్ గురించి అందరిలోనూ ఒక ఆసక్తి మరింత పెరుగుతుంది. అందువల్లే indian premier league మిగతా లీగ్ ల కంటే ఎక్కువగా ఆదరణ పొందింది.

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు కూడా ఈ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్నదంటే దానికి ప్రధాన కారణం ఇటువంటి వ్యవహారాలే. అయితే ఈ సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ప్రణాళిక ప్రకారం చోటుచేసుకున్నవి. ముందుగానే ఒక ప్లాన్ రూపొందిస్తారు. వాటి ఆధారంగా సంఘటనలు జరిగేలాగా క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని మీడియాలో వ్యాప్తి చేస్తారు. అనంతరం ఐపీఎల్ మీద హైప్ పెంచుతారు. ఇదేమి ఆరోపణ కాదు. విమర్శ అంతకంటే కాదు.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ.

ఆర్థిక కేసులలో నేపథ్యంలో లలిత్ విదేశాల్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఐపీఎల్ గురించి ఆయన కీలక విషయాన్ని బయటపెట్టారు. తద్వారా ఐపీఎల్ వెనక ఏముందో అందరికీ తెలిసేలా చెప్పారు.”ఐపీఎల్ రేటింగ్ లు పెంచడానికి మేము చాలా చేసేవాళ్లం. ఏదో ఒక విషయాన్ని క్రియేట్ చేసి.. దానికి విపరీతమైన హైప్ వచ్చేలా చేసేవాళ్లం. దీనివల్ల ఐపిఎల్ రేటింగ్స్ పెరిగేవి. దాంతో ఆదాయం విపరీతంగా వచ్చేది. అప్పట్లో ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి.. చీర్ లీడర్. తో సంబంధం క్రియేట్ చేసాం. ఆ తర్వాత అతడిని ఆమె పెళ్లి చేసుకుంది..ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలియదు గాని.. ఆ ఎపిసోడ్ ద్వారా భారీగా చర్చ మొదలైంది. మేము అనుకున్న రేటింగ్స్ వచ్చేసాయి. ఇంతకంటే చెప్పాల్సింది ఏముందని” లలిత్ వ్యాఖ్యానించాడు.

ఇప్పుడే కాదు లలిత్ అనేక సందర్భాలలో ఐపీఎల్ గురించి రకరకాల వ్యాఖ్యలు చేశాడు. యాజమాన్యాలు జట్లను కొనుగోలు చేయడం.. ఆటగాళ్ల మీద భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం.. ప్రసార హక్కులు.. ప్రకటనలు.. ఇతర వ్యవహారాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఐపీఎల్ అసలు రంగు బయటపడింది. ఐపీఎల్ రేటింగ్ గురించి లలిత్ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడంతో.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular