Homeఎంటర్టైన్మెంట్Peddi Overseas Collections: USA లో 'అజ్ఞాతవాసి' కూడా దాటలేకపోయిన 'పెద్ది'.. ఘోరమైన అవమానమే ఇది..

Peddi Overseas Collections: USA లో ‘అజ్ఞాతవాసి’ కూడా దాటలేకపోయిన ‘పెద్ది’.. ఘోరమైన అవమానమే ఇది..

Peddi Overseas Collections: నేటి తరం స్టార్ హీరోల్లో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితా తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు . అందుకు ముఖ్య కారణం ఆయన చేసిన సినిమాలే. మొదటి సినిమా నుండి ఆయన సినిమాలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే తెరకెక్కాయి. అయితే రామ్ చరణ్ కి ఉన్నటువంటి ఊర మాస్ […]

Peddi Overseas Collections: నేటి తరం స్టార్ హీరోల్లో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితా తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు . అందుకు ముఖ్య కారణం ఆయన చేసిన సినిమాలే. మొదటి సినిమా నుండి ఆయన సినిమాలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే తెరకెక్కాయి. అయితే రామ్ చరణ్ కి ఉన్నటువంటి ఊర మాస్ ఇమేజ్ , ఆయనకీ అర్బన్ సెంటర్స్ లో ఓపెనింగ్స్ ని తీసుకొని రావడానికి నెగెటివ్ గా మారుతుందా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా నైజాం , ఓవర్సీస్ ప్రాంతాల్లో రామ్ చరణ్ సినిమాలకు మొదటి నుండి ఓపెనింగ్స్ లో చాలా బలమైన ప్రభావం పడుతూనే ఉంది. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం తో మరోసారి రుజువు అయ్యింది.

రామ్ చరణ్ కెరీర్ లోనే విపరీతమైన హైప్ , క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. కానీ ఓవర్సీస్ లో మాత్రం చాలా దారుణమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది. విడుదలకు ముందు ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ ని చూసి , కచ్చితంగా ఈ చిత్రం కూడా నార్త్ అమెరికా లో ఓజీ , దేవర, కల్కి , సలార్ రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు , రాజా సాబ్ రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకోబోతుంది. ఈ స్థాయి హైప్ ఉన్న సినిమాకు ఇలాంటి ఓపెనింగ్ అవమానకరం అనే చెప్పొచ్చు. 2018 వ సంవత్సరం లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం నార్త్ అమెరికా లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. దాదాపుగా 1.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కూడా అందుకోవడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘పెద్ది’ కి ఓవర్సీస్ లో ఈ రేంజ్ దెబ్బ పడడానికి ముఖ్య కారణం , రామ్ చరణ్ నుండి ఈమధ్య కాలం లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం వల్లే. ‘రంగస్థలం’ తర్వాత #RRR ని మినహాయించి, విడుదలైన ప్రతీ రామ్ చరణ్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. #RRR చిత్రం లో రామ్ చరణ్ మెయిన్ హీరో అయినప్పటికీ, దాని క్రెడిట్ మొత్తం రాజమౌళి కే వెళ్ళింది. ప్రస్తుతం ఓవర్సీస్ లో ఒక సినిమాకు భారీ రేంజ్ లో ఓపెనింగ్ పడాలంటే, కచ్చితంగా క్రెడిబిలిటీ చాలా ముఖ్యం, అదే పెద్ది పై ప్రభావం చూపించింది, కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం , ఈ చిత్రం అనకాపల్లి నుండి అమెరికా వరకు సెన్సేషనల్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper