Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Flop Captains: ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్.. వీరి ఖేల్ ఖతం

IPL 2026 Flop Captains: ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్.. వీరి ఖేల్ ఖతం

IPL 2026 Flop Captains: ఐపీఎల్ ఈసారి సంచలనాలకు వేదికగా మారింది. కొంతమంది ఆటగాళ్లు అద్భుతం అనే స్థాయిలో ఆడుతుంటే.. మరి కొంతమంది దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు వాటిని అందుకోలేక విఫలమయ్యారు. అయితే ఆటగాళ్లుగా విఫలమైన వారు.. సారధ్య బాధ్యతలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈసారి ఐపీఎల్లో నలుగురు కెప్టెన్లు విపరీతమైన చర్చకు దారి తీశారు. వారంతా కూడా అద్భుతమైన ప్లేయర్లు. అయితే ఈ ఐపీఎల్లో అంతగా […]

IPL 2026 Flop Captains: ఐపీఎల్ ఈసారి సంచలనాలకు వేదికగా మారింది. కొంతమంది ఆటగాళ్లు అద్భుతం అనే స్థాయిలో ఆడుతుంటే.. మరి కొంతమంది దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు వాటిని అందుకోలేక విఫలమయ్యారు. అయితే ఆటగాళ్లుగా విఫలమైన వారు.. సారధ్య బాధ్యతలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఈసారి ఐపీఎల్లో నలుగురు కెప్టెన్లు విపరీతమైన చర్చకు దారి తీశారు. వారంతా కూడా అద్భుతమైన ప్లేయర్లు. అయితే ఈ ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో వారిలో ముగ్గురు మీద వేటుపడే అవకాశం కనిపిస్తోంది. మరొక ఆటగాడు తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రిషబ్ పంత్

ఇతడు నీ లక్నో జట్టు యాజమాన్యం 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి నాయకత్వంలో ఈసారి లక్నో జట్టు కేవలం 11 మ్యాచ్లలో.. మూడు మాత్రమే గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో లక్నో జట్టు గెలుస్తుందని నమ్మకం లేదు. పంత్ 11 మ్యాచులు వాడి కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. అతడు సరిగ్గా ఆడక పోవడంతో వచ్చే సీజన్లో సారధిగా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

అక్షర్ పటేల్

ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇతడు.. మొదట్లో వరుస విజయాలు అందించాడు. ఆ తర్వాత వరుస ఓటములతో నిరాశపరిచాడు. ఇటీవల బెంగళూరు మీద ఢిల్లీ సంచలనమైన విజయం సాధించింది. ఆ తర్వాత వరుస ఓటములతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో గెలిచినా సరే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు. అక్షర్ అంతగా జట్టును నడిపించలేకపోతున్నాడని విమర్శలు కనిపిస్తున్నాయి. ఆటగాడిగా కూడా అతడు ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆల్ రౌండర్ అయిన ఇతడు ఇప్పటివరకు వంద పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 10 వికెట్లు మాత్రమే తీగలిగాడు. వచ్చే సీజన్లో ఇతడి స్థానంలో రాహుల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

రహానే

కోల్కతా జట్టు నుంచి అయ్యర్ తప్పుకున్న తర్వాత రహానేకు అవకాశం వచ్చింది.. అయితే అతడు జట్టును అంత సమర్థవంతంగా నడిపించలేకపోతున్నాడు. 11 మ్యాచ్లలో అదరు 237 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు సరిగా ఆడలేక పోతున్నారు. దీంతో రహానే మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. రింకు సింగ్.. రఘు వంశీ మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోతున్నారు. భారీ ధరపెట్టి కొనుగోలు చేసిన గ్రీన్ తేలిపోతున్నాడు. దీంతో కోల్కతా జట్టు మేనేజ్మెంట్ వచ్చే సీజన్లో రహానే స్థానంలో మరొక ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తుందని తెలుస్తోంది. రహానే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడం వల్లే జట్టు ఓటములు ఎదుర్కొంటుందని మేనేజ్మెంట్ భావిస్తున్నది.

హార్దిక్ పాండ్యా

ముంబై జట్టు ఇతడిని ఏరి కోరి తీసుకొచ్చింది. ఇతడు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. హార్దిక్ పాండ్యా సరైన స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. దీనికి తోడు అతడికి గాయమైంది. గత రెండు మ్యాచ్లలో మేనేజ్మెంట్ అతడిని బెంచ్ కు పరిమితం చేసింది. వచ్చే సీజన్లో అతడు జట్టు నుంచి తప్పుకుంటాడని తెలుస్తోంది. లక్నో లేదా కోల్కతాకు సారధిగా వెళ్లే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper