spot_img
Homeక్రీడలుక్రికెట్‌Heinrich Klaasen Hyderabad Biryani Reaction: హైదరాబాద్ బిర్యాని తింటూ క్లాసెన్ కన్నీళ్లు.. ఇషాన్ కిషన్...

Heinrich Klaasen Hyderabad Biryani Reaction: హైదరాబాద్ బిర్యాని తింటూ క్లాసెన్ కన్నీళ్లు.. ఇషాన్ కిషన్ కడుపుబ్బా నవ్వులు..

Heinrich Klaasen Hyderabad Biryani Reaction: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కాటేరమ్మ కొడుకుగా క్లాసెన్ సుప్రసిద్ధుడు. కొంతకాలంగా అతడు హైదరాబాద్ జట్టుతో ప్రయాణం సాగిస్తున్నాడు. హైదరాబాద్ జట్టు అభిమానుల ప్రేమతో తడిసిపోతున్నాడు. ప్రతిసారి అతడు ఐపిఎల్ ఆడేందుకు వచ్చినప్పుడు హైదరాబాద్ అభిమానులు ప్రేమగా పలకరిస్తారు. వారి ప్రేమకు అతడు ఉబ్బి తబ్బిబైపోతాడు. అందువల్లే అతడు హైదరాబాద్ జట్టును వదిలి వెళ్ళకుండా.. ఉండిపోతున్నాడు.

క్లాసెన్ ప్రస్తుత ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడుగా వచ్చి మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడి ఆట తీరువల్ల హైదరాబాద్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతోంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆ స్కోర్ చేసింది అంటే దానికి ప్రధాన కారణం క్లాసెన్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి విపరీతమైన కష్టాల్లో ఉన్న హైదరాబాద్ జట్టుకు..క్లాసెన్ ఊపిరి పోసాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి బలమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్లేయర్లు బిర్యాని తిన్నారు.. ఇందులో క్లాసెన్ కూడా ఉన్నాడు. సాధారణంగా హైదరాబాద్ బిర్యానీ అంటే మంచి మసాలాలతో స్పైసీగా ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా టెండర్ గా ఉంటాయి. అందువల్లే హైదరాబాద్ బిర్యానిని చాలామంది ఇష్టపడుతుంటారు. క్లాసెన్ కు కూడా హైదరాబాద్ బిర్యానీ వడ్డించారు. అయితే అందులో మసాలాలు దిట్టంగా వేయడంతో క్లాసెన్ తట్టుకోలేకపోయాడు. బిర్యానీ లో ఉన్న ఘాటును తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఒక చేత్తో కన్నీళ్లను తుడుచుకుంటూ.. మరో చేత్తో అతడు బిర్యాని తిన్నాడు.

ఈ వ్యవహార మొత్తాన్ని తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్లాసెన్ ఏడుస్తూ ఉంటే.. హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ నవ్వుకున్నాడు.. ఈ వీడియో పోస్ట్ చేస్తూ నితీష్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు..”అతడు ఏదైనా ఇబ్బంది పడే సందర్భం ఉంది అంటే అది ఇదే” అంటూ నితీష్ కుమార్ రెడ్డి తనదైన వ్యాఖ్యానాన్ని జోడించాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper