Hardik Pandya Captaincy: గుజరాత్ జట్టుకు నాయకుడిగా ఉన్నప్పుడు హార్థిక్ పాండ్యా.. తిరుగులేని ఖ్యాతిని అందుకున్నాడు. ఎందుకంటే గుజరాత్ జట్టుకు అతడు ఐపిఎల్ ట్రోఫీ అందించాడు. అతడి నాయకత్వ సామర్థ్యాన్ని చూసిన ముంబై యాజమాన్యం.. భారీగా ధర చెల్లించి 2024 సీజన్ కు అతడిని తన జట్టులోకి తీసుకుంది. రోహిత్ శర్మ కాదని అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్
2024లో ముంబై జట్టుకు నాయకుడిగా వచ్చినప్పటికీ.. హార్దిక్ పాండ్యా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ముంబై యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని రోహిత్ భార్య బహిరంగంగానే విమర్శించింది. సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని మొత్తం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేసింది. అయితే 2024లో రోహిత్ అభిమానుల నుంచి హార్దిక్ పాండ్యా తీవ్రమైన నిరసన ఎదుర్కొన్నాడు. ఆ సీజన్లో ముంబై జట్టు అత్యంత దారుణంగా ప్రదర్శన చేసింది. ఫలితంగా హార్దిక్ పాండ్యా విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
2025 సీజన్లో ముంబై జట్టు కాస్త బెటర్ ఫెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ.. ఆ జట్టు స్థాయిలో మాత్రం కాదు. ఎందుకంటే ముంబై జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్.. ఇలా ఏ విషయంలో కూడా ముంబై జట్టుకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. అయితే కీలక సమయంలో ముంబై జట్టు ప్లేయర్లు చేతులెత్తేయడంతో ట్రోఫీ అందుకోకుండానే వెనుతిరిగింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై మరోసారి ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
2026 సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్దిరోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ముంబై జట్టుకు నాయకుడిగా సూర్య కుమార్ యాదవ్ ను నియమించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తెరపైకి తీసుకొచ్చాడు. “హార్థిక్ మంచి నాయకుడు. అందులో అనుమానం లేదు. ముంబై ఇండియన్స్ కు అతడు నాయకత్వం వహించడం మొదలు పెట్టిన తర్వాత.. తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ఇక ప్రస్తుతం టీమిండియా టి20 కెప్టెన్ సూర్య ఐపీఎల్ లో హార్దిక్ కెప్టెన్సీలో నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్త ఒత్తిడి తెచ్చే అంశంగానే ఉండవచ్చు. అయితే ముంబై యాజమాన్యం ఈ సీజన్లో హార్దిక్ ను ఒక ఆటగాడిగా పరిమితం చేసి.. సూర్య కుమార్ యాదవ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని” శ్రీకాంత్ పేర్కొన్నాడు.
అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం ముంబై యాజమాన్యం ఈ సీజన్లో కెప్టెన్ ను మార్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ముందుగానే ముంబై యాజమాన్యంతో ఒప్పందం కుదరచుకున్నాడు. అందువల్ల ఆ ఒప్పందం దాటి ముంబై యాజమాన్యం అతడి స్థానాన్ని వేరే వారితో భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
