spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan court case : పవన్ సినిమాలు సరే.. నటనను అడ్డుకుంటున్నారు

Pawan Kalyan court case : పవన్ సినిమాలు సరే.. నటనను అడ్డుకుంటున్నారు

Pawan Kalyan court case : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అస్మదీయ అధికారులు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. తెలుగు సమాజంలో ఏం జరిగినా దానిని కూటమి ప్రభుత్వానికి ముడి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అప్పుడు మరో ప్రవచనకర్త గరికపాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. అది వర్కౌట్ కాలేదు. మొన్నటికి మొన్న అదే గరికపాటి మధ్యాహ్న భోజనం పథకం పై మాట్లాడారు అంటూ దానిని కూటమికి లింక్ చేసే ప్రయత్నాలు చేశారు. ఒకరిద్దరూ మాజీ అధికారులు కూడా దీనిపై మాట్లాడారు. వారి ప్రయత్నం అంతటితోనే ఆగలేదు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవద్దు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేదాకా వారి పరిస్థితి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిని న్యాయస్థానం కొట్టివేసింది.

* జగన్ ప్రాపకం కోసమే..
వైసిపి ప్రభుత్వ హయాంలో అప్పటి పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు కొందరు అధికారులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి ప్రభావం తగ్గింది. ఏమో పని చేస్తున్నాం అంతే అన్నట్టు ఉంది వారి పరిస్థితి. విజయ్ కుమార్ వంటి వారు గత ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయడానికి పవన్ కళ్యాణ్ లాంటి వారిపై పిటిషన్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటే.. తన వృత్తిని కొనసాగించకూడదని ఏ చట్టం కూడా చెప్పలేదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా స్పష్టం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన సినిమాలను అడ్డుకోవాలి. లేకుంటే ఆయన సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలి. ఇదే ధ్యాసతో చాలామంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్న వారు వెనక్కి తగ్గడం లేదు. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ లకు చెక్ పెట్టినట్లు అయింది.

* పవన్ పై అదే కోపం..
పవన్ కళ్యాణ్ వైసీపీకి నిద్ర పట్టనివ్వరు. వారి నుంచి బలవంతంగా అధికారం గుంజుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి చంద్రబాబును ఎక్కించారు. అందుకే చంద్రబాబుతో విభేదాలు పవన్ కళ్యాణ్ కు రావాలని వైసిపి కోరుతోంది. ఆ విభేదాలు కూడా రావడం లేదు. అయితే ఆది నుంచి కేవలం పవన్ సినిమాలపైనే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై, ప్రత్యేకంగా తయారు చేసుకున్న వారాహి వాహనంపై, ఎన్నికల ఆఫిడవిట్ పై వైసిపి సానుభూతిపరులు కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. బురద జల్లాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయినా వర్కౌట్ కావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ప్రయత్నించేవారు పవన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular