Hardik Pandya Divorce
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు సారథి హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఐసీఎల్ సీజన్ 17లో హార్ధిక్ సారథ్యంలో తొలిసారి సారధ్యం వహించిన ముంబై జట్టు చివరి స్థానంలో నిలిచింది. తీవ్రమైన ఓటమి భారంతో ఉన్న అతనికి ఇప్పుడ ఆయన భార్య కూడా షాక్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్ధిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య నటాషా ఎలాంటి పోస్టు సోషల్ మీడియాలో పెట్టలేదు. కనీసం విషెస్ కూడా చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్షిప్లో చీలిక వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాకు దూరంగా..
హార్ధిక్–నటాషా దంపతులు గతంలో ఎక్కడికి వెళ్లినా వాటికి సంబంధించిన ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇటీవల వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోలు అప్డేట్ కావడం లేదు. దీంతో విడాకుల రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అయితే హార్ధిక్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తన భార్య ఫొటోలు తొలగించకపోవడంతో కొందరు విడాకుల వార్తలను ఖండిస్తున్నారు.
ప్రేమ.. పెళ్లి..
బాలివుడ్ హీరోయిన్ అయిన నటాషాను హార్ధిక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వైవాహిక బంధానికి నాలుగేళ్లు గడిచాయి. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. తాజాగా విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. వార్తలను ఖండించకపోవడంతో రూమర్స్ నిజమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐపీఎల్లో పేలవ ప్రదర్శన..
మరోవైపు ఐపీఎల్లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని.. హార్ధిక్ పాండ్యాకు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌ను తప్పించి పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో హార్ధిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా పేలవ ప్రదర్శన ఇచ్చాడు. తాజాగా పాండ్యా విడాకుల రూమర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో విఫలమవడానికి పాండ్యా నటాషా గొడవలే కారణమని ముంబై ఇండియా ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.