Babar Azam : క్రికెట్ లో కొంతమంది ప్లేయర్ల మీద అభిమానులకు అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని నిలుపుకోవడంలో ఆ ప్లేయర్లు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఎక్కడ ఏ మాత్రం తేడా కొట్టినా సరే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న అతడు తీవ్రమైన విమర్శలను మూట కట్టుకున్నాడు.
బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న అతడు బాబర్ ఆజామ్.. విఫల ప్రదర్శన చేస్తున్నాడు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. క్రీజ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. అతని మీద బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అతడు వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నాడు. కొన్ని సందర్భాలలో సింగిల్ డిజిట్ స్కోర్ కే ఔట్ అవుతున్నాడు. అతడి కంటే షాహిన్, అమీర్ బెటర్ అంటే.. ఎలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
బిగ్ బాష్ లీగ్ లో ఏ ఆటగాడయినా సరే సూపర్ ఆట తీరు ప్రదర్శిస్తాడు. కానీ, బాబర్ ఆజామ్ మాత్రం గల్లి స్థాయి ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. అతడి ఆట తీరు పట్ల ఆస్ట్రేలియా మీడియా దారుణమైన వ్యాఖ్యలు చేస్తోంది. ” ఇటువంటి ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారు? ఎందుకు ఈ స్థాయిలో డబ్బులు చెల్లిస్తున్నారు? మైదానంలోకి రావడం, వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోతోంది. ఇటువంటి ఆటగాడికి అవకాశాలు ఎందుకిస్తున్నారు. వేరే ప్లేయర్లు ఎవరూ లేరా? ఇతడిని కావాలని ఎందుకు ఎంపిక చేస్తున్నారని” ఆస్ట్రేలియా మీడియా తన కథనాలలో అభిప్రాయపడుతోంది.
బాబర్ బిగ్ బాష్ లీగ్ లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు . తన స్థాయికి తగ్గట్టుగా అడగలేకపోతున్నాడు. కఠినమైన బంతులే కాదు, మామూలు బంతులను కూడా ఎదుర్కోలేకపోతున్నాడు. అతడి బలహీనతలను గమనించిన ప్రత్యర్థి బౌలర్లు పదే పదే ఆ బంతులను వేస్తున్నారు. వాటిని ఎదుర్కోలేక బాబర్ విఫలమవుతున్నాడు. అలా విఫలం కావడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడిని ఎంపిక చేయడం పట్ల ఆస్ట్రేలియా మీడియా మాత్రమే కాదు, మామూలు అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MICHAEL VAUGHAN TROLLED BABAR AZAM
Babar can't make it into England or Australia's T20 teams. He is too slow, but Shaheen and Amir are far better."
He says Babar is NOT fit for elite T20 standards.
Is Babar Azam a 'King' only on paper? pic.twitter.com/MPGxNZub8k
— Sam (@Cricsam01) January 12, 2026