యాషెస్ సిరీస్(The Ashes) లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా(AUS vs ENG) జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. తొలి మూడు టెస్టులను గెలుచుకున్న ఆస్ట్రేలియా.. నాలుగో టెస్ట్ లో ఓడిపోయింది. ఐదో టెస్టు ఆదివారం మొదలైంది.. ఈ టెస్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో(Sydney cricket ground) మొదలైంది.
ఫస్ట్ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.. ఓపెనర్లు క్రాలే(16), డకెట్ (27), వన్ డౌన్ ప్లేయర్ బెతల్ (10) విఫలమయ్యారు. నేసర్, బోలాండ్, స్టార్క్ తలా ఒక వికెట్ సాధించారు. బ్రూక్ (78), రూట్ (72) పరుగులతో కొనసాగుతున్నారు. నాలుగో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. జనవరి 4న ప్రారంభమయ్యే సిడ్నీ టెస్ట్ తనకు చివరిదాని ప్రకటించాడు. సిడ్నీ మైదానంలో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సంబంధించి మరో 12 పాయింట్ల పట్టించుకోవాలని ఆస్ట్రేలియా భావించగా.. ఖవాజా తన రిటైర్మెంట్ ప్రకటించి ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇచ్చాడు.
” నా కెరియర్లో సిడ్నీ టెస్ట్ చివరిది. క్రికెట్ ద్వారా నేను ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంపాదించాను. మోయగలిగే జ్ఞాపకాలను.. అద్భుతమైన స్నేహాలను నాకు క్రికెట్ అందించింది. తల్లిదండ్రులు తోడ్పడ్డారని” ఖవాజా పేర్కొన్నాడు.
ఖవాజా కు 15 సంవత్సరాల కెరియర్ ఉంది. అన్ని ఫార్మాట్లో కలిపి అంతర్జాతీయంగా 8000 పరుగులు చేశాడు. 87 టెస్టులు, 40 వన్డేలు, 9 t20 లో ఆడాడు. 2022లో కోవిడ్ వల్ల ఖవాజా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టుపై రెండు సెంచరీలు సాధించి సత్తా చూపించాడు. “రెండు పడక గదులు గల చిన్న అపార్ట్మెంట్లో మా కుటుంబం నివాసం ఉండేది. ఆరోజే నేను టెస్ట్ క్రికెటర్ కావాలని అనుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. ఇది నాకు చాలా గొప్ప విషయమని” ఖవాజా భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు. జట్టులోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాల అతడు ఏడు సెంచరీలు చేశాడు. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడు. 2023లో ఐసీసీ ఇతడిని ఉత్తమ టెస్ట్ క్రికెటర్ గా ఎంపిక చేసింది.