Homeక్రీడలుక్రికెట్‌Gavaskar treatment: కోట్లు కుమ్మరించినా.. లెక్కలేనితనం.. ఫారిన్ ప్లేయర్లకు గవాస్కర్ ట్రీట్మెంటే సరి

Gavaskar treatment: కోట్లు కుమ్మరించినా.. లెక్కలేనితనం.. ఫారిన్ ప్లేయర్లకు గవాస్కర్ ట్రీట్మెంటే సరి

Gavaskar treatment: ఐపీఎల్ లో ఇండియన్ ప్లేయర్ల కంటే ఫారిన్ ప్లేయర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ, ఆ విశ్వాసం ఫారిన్ ప్లేయర్లకు ఏమాత్రం లేదు. పైగా ఐపీఎల్లో భారీగా ధర దక్కించుకున్న వాళ్ళు మాత్రమే ఆడుతున్నారు. ఒక మోస్తరు ధర సొంతం చేసుకున్న ప్లేయర్లు ఆడేందుకు రావడం లేదు. ఐపీఎల్ లో ఆడటానికి రాబోమని నేరుగా చెప్పలేక.. గాయాలు అయ్యాయని సాకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈసారి ఐపీఎల్లో ఫారిన్ ప్లేయర్లు గైర్హాజరయ్యారు. వారంతా కూడా […]

Gavaskar treatment: ఐపీఎల్ లో ఇండియన్ ప్లేయర్ల కంటే ఫారిన్ ప్లేయర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ, ఆ విశ్వాసం ఫారిన్ ప్లేయర్లకు ఏమాత్రం లేదు. పైగా ఐపీఎల్లో భారీగా ధర దక్కించుకున్న వాళ్ళు మాత్రమే ఆడుతున్నారు. ఒక మోస్తరు ధర సొంతం చేసుకున్న ప్లేయర్లు ఆడేందుకు రావడం లేదు. ఐపీఎల్ లో ఆడటానికి రాబోమని నేరుగా చెప్పలేక.. గాయాలు అయ్యాయని సాకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈసారి ఐపీఎల్లో ఫారిన్ ప్లేయర్లు గైర్హాజరయ్యారు. వారంతా కూడా గాయాల బారిన పడ్డట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి మొదలుపెడితే రాజస్థాన్ వరకు అన్ని జట్ల పరిస్థితి ఇలానే ఉంది. బౌలర్లు లేదా బ్యాటర్లు గాయపడ్డారని.. వారు టోర్నీకి దూరంగా ఉన్నారని ఇటీవల కాలంలో వార్తలు రావడం పరిపాటిగా మారింది. సమర్థవంతమైన ప్లేయర్లు ఉంటే పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ లు అన్ని కూడా ఇలానే సాగాయి. కానీ, ఈసారి మాత్రం అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. పైగా ఫారిన్ ప్లేయర్లు రకరకాల కారణాలు చెప్పి.. టోర్నీ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా ఆయా యాజమాన్యాలకు షాక్ ఇస్తున్నారు.

అయితే ఇటువంటి ప్లేయర్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని టీ మీడియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడుతున్నాడు. ఫారిన్ ప్లేయర్ల విషయంలో యాజమాన్యాలు కఠినంగా ఉండాలని చెప్తున్నారు. చాలామంది ఐపీఎల్ ను తేలికగా తీసుకుంటున్నారని.. అలాంటి వారంతా లైన్లోకి రావాలంటే.. కఠినంగా ఉండాలని చెబుతున్నాడు.

“గాయాలు లేకపోయినప్పటికీ చాలామంది ప్లేయర్లు యాజమాన్యాలకు అందుబాటులో ఉండడం లేదు. కొందరేమో ట్రైనింగ్ క్యాంప్ కు లేటుగా వస్తున్నారు. ఫ్రాంచైజీలు చెప్పినట్టు వింటాయని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు యాజమాన్యాలు కూడా ప్లేయర్లకు తగ్గట్టుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వాళ్ల కుటుంబ సభ్యులకు అయ్య ఖర్చులు కూడా భరిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ప్లేయర్లు ఆడేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదని” గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ విషయంలో ఐపీఎల్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి యాజమాన్యాలు పరిశీలించాలి. కొంతమంది ఫారిన్ ప్లేయర్లు చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2025 మెగా వేలానికి ముందు పాలకమండలి అక్రమమైన నిబంధనలు విధించింది. గాయాలు లేదా అత్యవసర పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ప్లేయర్లు టోర్నీకి దూరంగా ఉండాలి. అలాకాకుండా అకస్మాత్తుగా తట్టుకుంటే ప్లేయర్ల మీద రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్టు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సారథి బ్రూక్ ను రాజస్థాన్ జట్టు 2025 మెగా వేలంలో కొనుగోలు చేసింది. చివరి నిమిషంలో అతడు తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలకమండలి అతని మీద నిషేధం విధించింది. అతడు ఇలా చేయడం ఇది రెండవసారి.. అయితే ఈసారి ఐపీఎల్లో బెంగళూరు ప్లేయర్ హెజిల్ వుడ్, ఢిల్లీ బౌలర్ స్టార్క్.. ఇంకా కొంతమంది ప్లేయర్లు గాయాలను సాకుగా చూపిస్తున్నారు. వీరంతా టోర్నీలో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అందువల్లే ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని గవాస్కర్ కోరుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper