Homeక్రీడలుFIFA World Cup: అవి వేసుకోండి..బెడ్ మీద రెచ్చిపోండి.. తర్వాత ఫుట్ బాల్ ఆడి గెలవండి

FIFA World Cup: అవి వేసుకోండి..బెడ్ మీద రెచ్చిపోండి.. తర్వాత ఫుట్ బాల్ ఆడి గెలవండి

FIFA World Cup: ఇటువంటి ఆఫర్ వస్తే ఏ జట్టు ప్లేయర్లకు అయినా సరే పండగే. పైగా స్వయంగా మేనేజ్మెంట్ ఇలాంటి పనిచేయమని చెప్పడం.. దగ్గరుండి ప్రోత్సహించడం మామూలు విషయం కాదు. దీంతో ఆ ప్లేయర్లలో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది.. ఎప్పుడెప్పుడు ఆ పని చేయాలా అనే తాపత్రయం పెరిగిపోతోంది. ఈ విషయం బయటికి రావడంతో.. మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో.. చర్చ మరింత రంజుగా సాగుతోంది. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సాగుతోంది. ఇప్పటికే చాలా […]

FIFA World Cup: ఇటువంటి ఆఫర్ వస్తే ఏ జట్టు ప్లేయర్లకు అయినా సరే పండగే. పైగా స్వయంగా మేనేజ్మెంట్ ఇలాంటి పనిచేయమని చెప్పడం.. దగ్గరుండి ప్రోత్సహించడం మామూలు విషయం కాదు. దీంతో ఆ ప్లేయర్లలో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది.. ఎప్పుడెప్పుడు ఆ పని చేయాలా అనే తాపత్రయం పెరిగిపోతోంది. ఈ విషయం బయటికి రావడంతో.. మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో.. చర్చ మరింత రంజుగా సాగుతోంది.

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సాగుతోంది. ఇప్పటికే చాలా వరకు మ్యాచులు ముగిసిపోయాయి. కీలక మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. చాలావరకు జట్లు ఇంటిదారి పట్టాయి. గొప్పగా ఆడిన జట్లు ముందుకు సాగాయి. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఒక వార్ లాగే ఉంటుంది. ఈ రణంలో గెలవాలి అంటే కచ్చితంగా ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ప్రదర్శన చేయాలి. అది జరగాలంటే ఆటగాళ్ల మీద ఒత్తిడి ఉండకూడదు. ఆ ఒత్తిడిని దూరం చేయడానికి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తన ప్లేయర్లకు ఒక అనుకోని అదృష్టాన్ని కల్పించింది. అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది.

ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు రౌండ్ 16 లో భాగంగా ఈనెల 6న మెక్సికోతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లు వ** మాత్రలు వాడబోతున్నారు. వీటిని వేసుకున్న తర్వాత.. ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ జీవిత భాగస్వాములు.. స్నేహితురాళ్ల తో వారు పడకమీద అద్భుతమైన పోరాటం సాగించవచ్చు. ఆ పోరాటం సాగించిన తర్వాత ప్లేయర్ల మీద ఒత్తిడి తగ్గుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఈ మ్యాచ్ మెక్సికోలోని ఎస్టా డియో స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం సముద్రమట్టానికి 7350 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ మామూలు వాతావరణ కంటే ఎక్కువ ఒత్తిడి పూరితమైన వాతావరణం ఉంటుంది. అక్కడ సాధారణం కంటే ఎక్కువ అలసట ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆల్టిట్యూడ్ సిక్ నెస్ ను అధిగమించాలంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు కచ్చితంగా అది వాడాలని మేనేజ్మెంట్ సూచించింది. దాన్ని వాడిన తర్వాత.. భార్యలు.. గర్ల్ ఫ్రెండ్స్ తో ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది.. దీనివల్ల ప్లేయర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది.. ఆట మీద పూర్తిస్థాయిలో మనసు లగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆల్టిట్యూడ్ సిక్ నెస్ ను దూరం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper