HomeతెలంగాణK Kavitha TRS Row: కవిత చేతిలో టిఆర్ఎస్.. గుంజుకోవడానికి సిద్ధంగా కెసిఆర్.. తెలంగాణలో ఏం...

K Kavitha TRS Row: కవిత చేతిలో టిఆర్ఎస్.. గుంజుకోవడానికి సిద్ధంగా కెసిఆర్.. తెలంగాణలో ఏం జరుగుతోంది..

K Kavitha TRS Row: జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలని.. మోడీని గద్దె దించాలని అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మస్తు కలలుగా కన్నాడు కదా.. గాలి మోటార్లలో పంజాబ్, తమిళనాడు, కేరళ, బీహార్, ఉత్తర ప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాడు కదా.. రైతులకు చెక్కులు (తెలంగాణ సొమ్ము) కూడా ఇచ్చాడు కదా. ఏకంగా తెలంగాణ ప్రజలు చెల్లించిన సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయంగా సలహాదారుడిని కూడా నియమించుకున్నాడు కదా.. ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటే.. తెలంగాణ ప్రజలు ఇచ్చిన […]

K Kavitha TRS Row: జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలని.. మోడీని గద్దె దించాలని అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మస్తు కలలుగా కన్నాడు కదా.. గాలి మోటార్లలో పంజాబ్, తమిళనాడు, కేరళ, బీహార్, ఉత్తర ప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాడు కదా.. రైతులకు చెక్కులు (తెలంగాణ సొమ్ము) కూడా ఇచ్చాడు కదా. ఏకంగా తెలంగాణ ప్రజలు చెల్లించిన సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయంగా సలహాదారుడిని కూడా నియమించుకున్నాడు కదా.. ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటే.. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కారు చక్రాలు విరిగిపోయాయి. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లు రావడంతో కారు షెడ్డు కి వెళ్లాల్సి వచ్చింది.

ఇక్కడితోనే కారు పార్టీ పరిస్థితి అయిపోలేదు. కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. కారు పార్టీ అధినేత కుమార్తె కవిత బయటికి వచ్చేసారు. ఏకంగా రాజకీయ పార్టీని పెట్టేశారు. దానికి తెలంగాణ రక్షణ సేన అని నామకరణ చేశారు. తన తండ్రి కాదనుకున్న టిఆర్ఎస్ ను తనకు సొంతమయ్యేలా చేసుకున్నారు. ఫలితంగా టిఆర్ఎస్ అధినేత్రి అయిపోయారు.

నాడు దేశంలో గత్తర లేపాలి అనుకున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో గెలవ లేకపోవడంతో.. మళ్లీ ఫామ్ హౌస్ లోకి వచ్చేసారు. భారత రాష్ట్ర సమితి గా పార్టీ పేరును మార్చి తప్పు చేశామని గతంలోనే కేటీఆర్ అనేక సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరును మార్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పేరు ఎవరికి కేటాయించకుండా ఉండడానికి ఎన్నికల సంఘాన్ని కలిచే ఆలోచనలో గులాబీ పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కవిత ఆమధ్య టిఆర్ఎస్ పార్టీ ప్రకటనను గులాబీ పార్టీ నేతలు తప్పు పట్టారు. దీనిపై 600 అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి వెళ్ళాయి. మరోవైపు మహారాష్ట్రలో సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమాజ సేవా సంస్థ.. టిఆర్ఎస్ పేరును ఎవరికి కేటాయించకూడదని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎన్నికల సంఘాన్ని కలవడానికి కవిత వెళ్తున్నట్టు తెలుస్తోంది.

మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిగా ఇప్పుడు టిఆర్ఎస్ కోసం కొట్లాడుతోంది. మొన్నటిదాకా జాగృతి పేరుతో కార్యకలాపాలు సాగించిన కవిత టిఆర్ఎస్ పేరును తనకు మాత్రమే సొంతం అయ్యేలా కదుపుతున్నారు.. మధ్యలో మహారాష్ట్ర వాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ అనే పదాన్ని దేశ రాజకీయాల కోసం పక్కన పెట్టిన వాళ్ళు… ఈరోజు సొంత రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి మళ్లీ తెలంగాణ అనే పదాన్ని అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నించడం నిజంగా హాస్యాస్పదం. మళ్లీ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ గురించి.. తెలంగాణ భావోద్వేగం గురించి
.. తెలంగాణ మట్టి గురించి మాట్లాడతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper