spot_img
Homeక్రీడలుచెన్నై రిటర్న్‌ బ్యాక్.. జీర్ణించుకోలేకపోతున్న ధోని ఫ్యాన్స్

చెన్నై రిటర్న్‌ బ్యాక్.. జీర్ణించుకోలేకపోతున్న ధోని ఫ్యాన్స్

CSK Dhoni

ధోనీ.. ఇండియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌. నిల్చున్న చోట నుంచి సిక్స్‌లు బాదే ఘనుడు. చివరి నిమిషంలోనూ మ్యాచ్‌ తమ వైపు తిప్పడంలో ఆయనకు ఆయనే సాటి. దేశానికి వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌. అన్నింటికీ మించి ఆయన ఆట తీరు.. ఆయన వ్యవహార శైలి. అలాంటి ధోనీ జట్టు దుబాయి వేదికగా నడుస్తున్న ఐపీఎల్‌లో సత్తా చాటలేకపోయింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేక చేతులెత్తేసింది.

Also Read: చెన్నై ఫ్యాన్స్ భావోద్వేగం.. గెలిచినా-ఓడినా CSKతోనే..!

ఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్‌ చేరి అరుదైన రికార్డు సృష్టించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి పరాజయాల పరంపరంతో ఆ ఛాన్స్‌ దూరం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో అందరినీ అలరించింది. కానీ ఈ సారి సెమీఫైనల్స్ కాదు కదా.. కనీసం ప్లేఆఫ్స్‌ను చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఓ జట్టు ఇలా కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. గత సీజన్‌లో ఫైనల్స్ చివరి బంతి వరకూ వెళ్లింది. ఈ ఏడాది మాత్రం ఆ సత్తా చాటలేకపోయింది.

Also Read: ఆ‘రేంజ్‌ ఆర్మీ’.. లాస్ట్ పంచ్ లో సన్ ‘రైజర్స్’

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నై టీమ్‌ను పలు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా కొంత మంది టీంకు దూరం అయ్యారు. సరైన ప్రాక్టీస్‌కు సమయం దొరకలేదు. హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అంతేకాదు, కీలకమైన మ్యాచ్‌లలో ధోనీ సరిగా ఆడలేదని విమర్శకులు అంటున్నారు. ఇమ్రాన్ తాహిర్ లాంటి మంచి బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడం, బ్రావో గాయపడడం జట్టు వైఫల్యానికి ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper