Homeక్రీడలుక్రికెట్‌BCCI IPL Loss 2400 Crore Lalit Modi Statement: బీసీసీఐ నిర్వాకం.. ఐపీఎల్ వల్ల...

BCCI IPL Loss 2400 Crore Lalit Modi Statement: బీసీసీఐ నిర్వాకం.. ఐపీఎల్ వల్ల 2,400 కోట్ల నష్టం.. లలిత్ మోడీ బయటపెట్టిన నిజం

BCCI IPL Loss 2400 Crore Lalit Modi Statement: భారత క్రికెట్ నియత్రణ మండలి 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తెరపైకి తీసుకువచ్చింది. దీనిద్వారా ఆదాయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. విదేశీ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. తద్వారా ఐపిఎల్ గ్లోబల్ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంది. ఓ అంచనా ప్రకారం ఐపీఎల్ విలువ లక్ష కోట్లను దాటిపోయిందని తెలుస్తోంది. ఇది ఫుట్ బాల్ క్లబ్ ల విలువలో రెట్టింపు. […]

BCCI IPL Loss 2400 Crore Lalit Modi Statement: భారత క్రికెట్ నియత్రణ మండలి 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తెరపైకి తీసుకువచ్చింది. దీనిద్వారా ఆదాయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. విదేశీ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. తద్వారా ఐపిఎల్ గ్లోబల్ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంది. ఓ అంచనా ప్రకారం ఐపీఎల్ విలువ లక్ష కోట్లను దాటిపోయిందని తెలుస్తోంది. ఇది ఫుట్ బాల్ క్లబ్ ల విలువలో రెట్టింపు.

ఇటీవల రాజస్థాన్ జట్టు.. బెంగళూరు జట్టు చేతులు మారాయి. దాదాపు ఈ రెండు జట్లను సొంతం చేసుకోవడానికి దాదాపు 36వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారు. దీనినిబట్టి ఐపిఎల్ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఐపీఎల్ వల్ల బిసిసిఐ ప్రతి ఏడాది భారీగా లాభాలను కళ్ళజూస్తుందని అందరూ అనుకుంటారు. బీసీసీఐ చెప్పే మాటలను నమ్ముతారు. ఒకరకంగా ఐపీఎల్ నిర్వహణను కూడా బిసిసిఐ అంగరంగ వైభవంగా చేపడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఐపీఎల్ నిర్వహణలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానం వల్ల విపరీతంగా నష్టం వస్తుందని తాజాగా ఓ వార్త మీడియాలో సర్కులేట్ అవుతోంది.

ఈ విషయాన్ని ఐపీఎల్ పూర్వ చైర్మన్ లలిత్ మోడీ బయటపెట్టారు.. ఐపీఎల్ లో పాత ఫార్మాట్ ను ఆసరించకపోవడం వల్ల బీసీసీఐ దాదాపు 2,400 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ విషయాన్ని లలిత్ మోడీ వెల్లడించారు..”పరిచట్లు ఉన్నప్పుడు ప్రతి టీం పరస్పరం రెండుసార్లు తలపడితే 94 మ్యాచులు (హోమ్ అవే) జరగాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 74 కి పడిపోయింది. తగ్గిన మ్యాచ్ల వల్ల ఒక్కో మ్యాచ్ కు వచ్చే 118 కోట్ల మీడియా రైట్స్ ఆదాయం మొత్తం పోతోంది. ఆయా యాజమాన్యాలు కూడా 120 కోట్ల చొప్పున నష్టాన్ని భరించాల్సి వస్తోంది. దీనివల్ల మొత్తంగా 2400 కోట్ల ఆదాయం పోతోంది. పరోక్షంగా కూడా బీసీసీఐకి ఆదాయం వస్తుంది. కానీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల అది కూడా రాకుండా పోతోందని” లలిత్ వ్యాఖ్యానించారు.

ఇటీవల లక్నో జట్టు యజమాని సంజీవ్ పై కూడా లలిత్ విమర్శలు చేశారు. అతడు ఒక లూజర్ అంటూ వ్యాఖ్యానించారు. జోకర్ అంటూ పేర్కొన్నారు. అతనికి ఐపీఎల్ ఆడే విధానం తెలియదని.. క్రికెట్ మీద అవగాహన లేదని.. అందువల్లే పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడని లలిత్ ఆరోపించాడు. ” ఆట గురించి తెలియని వారు క్రికెట్లోకి రాకూడదు. ఆటలో గెలుపు ఓటములు అత్యంత సహజం. ఈ విషయం తెలియకుండానే సంజీవ్ ఇష్టానుసారంగా వ్యవహరించడం అతడి దిగజారుడు ప్రవర్తనకు నిదర్శనమని” లలిత్ వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper