Homeఆధ్యాత్మికంToday 25 March 2026 Horoscope: ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే...

Today 25 March 2026 Horoscope: ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.

Today 25 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన పనులు జరుగుతాయి. […]

Today 25 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన పనులు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణముంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో రాణిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కీలక ఒప్పందాలను చేసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సమాజంలో గౌరవం లభిస్తుంది. సాంకేతిక రంగంలో పనిచేసే వారికి శుభవార్తను అందుతాయి. నిరుద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు చాలావరకు ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో సంతృప్తిగా ఉంటారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లొద్దు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు డబ్బు వ్యవహారాలను ఎక్కువగా జరుపుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వివాదాల్లోకి చుట్టుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారికి ఈ రోజు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షలకు విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్వహిస్తుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా భారీగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతిని పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper