Homeఆధ్యాత్మికంToday 19 April 2026 Horoscope: ఈ రెండు రాశుల వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక...

Today 19 April 2026 Horoscope: ఈ రెండు రాశుల వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక ధన లాభం..

Today 19 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. […]

Today 19 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. ప్రియమైన వారి జీవితం సంతోషంగా గడుస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను సేకరిస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా కొన్ని ముఖ్యమైన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే వీరికి గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అనుకున్న ఒక కోరికను నెరవేర్చుకుంటారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన లాభాలు ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ చేసేవారు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు డబ్బు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తు విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విద్యార్థులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులు కొత్త భాగంలో చేర్చుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల అనుగ్రహంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండటంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సహకారం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీపరిచిన పాల్గొంటారు. స్నేహితుల ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు పెద్దల ఆశీస్సులు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యార్థులు పై చదువుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper