spot_img
Homeఆధ్యాత్మికంUgadi New Year Telugu: తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఇవి ఎలా ఏర్పడ్డాయి? పరాభవ అంటే...

Ugadi New Year Telugu: తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఇవి ఎలా ఏర్పడ్డాయి? పరాభవ అంటే అర్థం ఏంటి?

Ugadi New Year Telugu: సాధారణంగా ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. కానీ తెలుగు క్యాలెండర్ ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అయితే తెలుగు సంవత్సరాలు మొత్తం 60 గా చెప్పబడుతున్నాయి. ప్రతి సంవత్సరానికి ఒక పేరుని కూడా నిర్ణయించారు. మీ 60 సంవత్సరాల చక్రం బృహస్పతి ఆధారంగా ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. బృహస్పతి గ్రామ్ 12 సంవత్సరాల్లో ఒక చక్రం పూర్తి చేసుకుంటుంది. శని గమనంతో కలిపి 60 సంవత్సరాలకు ఒక పూర్తి సమన్వయం చక్రం ఏర్పడుతుంది. అందుకే 60 పేర్లుగా నిర్ణయించబడ్డాయి. అయితే ఈ 60 సంవత్సరాల కాలం ఏర్పడడం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?

పురాణాల ప్రకారం నిత్యం నారాయణ నామ స్మరణలో ఉండే నారద మహర్షి ఒకసారి ఐహిక జీవితం ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నారు. అలాగే గృహస్థాశ్రమం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒక స్త్రీ రూపంలో ఒక రాజ్యానికి చేరిన నారదుడు అక్కడి రాజును వివాహం చేసుకొని గృహ జీవితంలో పూర్తిగా లీనమైపోతాడు. కార్యక్రమంలో 60 మంది సంతానం కలుగుతుంది. కుటుంబ పందాలు, ప్రేమ, బాధ్యతల మధ్య తన అసలు స్వరూపాన్ని మరిచిపోతాడు.

ఇలాంటి సమయంలో నారదుడికి తిరిగి తన యదార్థ బ్రహ్మర్షి స్వరూపాన్ని తీసుకురావాలని విష్ణు నిర్ణయిస్తాడు. దీంతో తన మాయతో జరిగిన ఒక సంఘటనలో 60 మంది కుమారులు మరణిస్తారు. ఈ దుఃఖంతో తీవ్రంగా కుంగిపోయిన నారదుడు మళ్ళీ తన అసలు రూపాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. జీవితం, మాయ, బంధాల మధ్య తన అసలు రూపాన్ని ధరిస్తాడు. అప్పుడు తన పిల్లల జ్ఞాపకం శాశ్వతంగా నిలవాలని నారదుడు విష్ణువును ప్రార్థించగా.. వారి పేర్లు కాలచక్రంలో నిలబెట్టారని కదా చెబుతోంది. ఆ 60 మంది కుమారుల పేర్లే తర్వాత 60 సంవత్సరాల పేర్లుగా ప్రసిద్ధి చెందాయని విశ్వసిస్తారు.

ఈ 60 సంవత్సరాలలో 40వది పరాభవ నామ సంవత్సరం. 2026 మార్చి 19 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రవంగ నామ సంవత్సరం వస్తుంది. పరాభవ నామ సంవత్సరానికి ముందు విశ్వావసు నామ సంవత్సరం కొనసాగింది. అయితే ప్రస్తుతం గడిచే పరాభవ నామ సంవత్సరం అనగానే చాలామంది భయపడిపోతున్నారు. సాధారణంగా పరాభవం అంటే అవమానం, ఓటమి, అపజయం. దీంతో ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటివి తమ జీవితంలో ఉంటాయని ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి పరాభవ అంటే వ్యక్తి జీవితంలోని జయ, అపజయాలను సూచించేది కాకుండా చెడు స్వభావాలపై సాధించాల్సిన అంతర్ముఖ విజయం అని అర్థం తెలుపుతున్నట్లు కొందరు పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిష్టాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడే వారికి ఈ సంవత్సరం విజయాలు చేకూరుతాయని భావిస్తున్నారు. కొంతమంది పండితులు తెలుపుతున్న ప్రకారం పరా అంటే అమ్మవారు.. పరాశక్తి అని అర్థం. భవ అంటే ఉండు అని.. శివతత్వం అని భావిస్తారు. అంటే అమ్మవారికి సమీపంగా ఉండడం అని అర్థం వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular