ఆధ్యాత్మికంGupt Navratri 2024: వారాహి దేవిని ఎలా పూజించాలి.. వ్రతాచారం ఏంటి? ఆషాఢ గుప్త నవరాత్రుల...

Gupt Navratri 2024: వారాహి దేవిని ఎలా పూజించాలి.. వ్రతాచారం ఏంటి? ఆషాఢ గుప్త నవరాత్రుల ప్రత్యేకతేంటంటే?

Gupt Navratri 2024: ఆషాడ మాసం అంటే పూజలు పుణ్యక్షేత్రాలు అంటూ వెళ్తుంటారు భక్తులు. ఈ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అని పిలుస్తుంటారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయవచ్చా? లేదా? ఇంతకీ ఈ వారాహీ అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం?

బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్యపురాణాలలో వారాహి దేవి మహిమల గురించి ప్రస్తావించారు.

బ్రహ్మాండ పురాణం ఏం చెబుతుంది?
అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహించేందుకు పుడుతుందట. అమ్మలందరకీ మూలపుట్టమ్మ లలితాదేవి అని అంటారు. దేవతలంతా ఆమెకు సహకరిస్తాం అంటే వద్దని వారించిన అమ్మవారు.. తనలోపల నుంచే సృష్టి ప్రారంభిస్తుందట. అలా లలితాదేవి బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి , హృదయంలోంచి బాలాత్రిపుర సుందరి, అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవిస్తారు. లలితాదేవికి వారాహీదేవి సైన్యాధ్యక్షురాలిగా నియమించగా…అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుడని చంపేస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది.

మార్కండేయ పురాణం ఏం చెబుతుంది?
వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తినే వారాహి శక్తి అంటారట. చండీసప్తశతి లో అమ్మవారిగురించి ప్రస్తావన ఉందట. రాక్షససంహారం కోసం లలితాదేవికి…దేవతలంతా వారి శక్తులను ఇస్తారు. బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రాహ్మీరూపంలో, శివుడు పార్వతీదేవిని మాహేశ్వరి, విష్ణువు వైష్ణవి, నారసింహుడు ప్రత్యంగిరీ దేవి , కుమారస్వామి కౌమారీ రూపంలో శక్తులను ఇచ్చారు. వీరినే సప్తమాతృకలు అని పిలుస్తారు.

హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు మృత్యువులేని వరం అమ్మవారిని ప్రార్థించి కోరతాడు . అమ్మవారు తప్ప దేవతలు, మనుషులు తనను చంపకూడదని కోరుతాడు. అంతేకాదు వెనువెంటనే కూడా అమ్మవారు తనను చంపకుండా వరం పొందుతాడు. దీంతో వరాహస్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని సంహరిస్తుందని ఈ మార్కండేయ పురాణం చెబుతుంది…

మత్స్యపురాణం ఏం చెబుతుంది?
అంధకాసురుడిని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళుతున్నప్పుడు కొన్ని శక్తులు ఆ పరమశివుడికి సహాయం చేస్తాయి. వాటిలో ఒకటి వారాహీ అమ్మవారు అని ఈ మత్స్యపురాణం చెబుతుంది.

ఎవరు పూజించాలి?
మంచివారికి శుభం కలిగిస్తే..అహంకారం, అసూయ, ఈర్ష్య,ద్వేషంతో ఉండే వారికి అమ్మవారు దూరంగా ఉంటుందట. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించడం సాధ్యం అవుతుంది. లేదంటే ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వరట. అంటే.. తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది అని అంటారు పండితులు. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలని.. వామాచార పద్ధతుల జోలికి వెళ్లకూడదు అని అంటారు. బ్రహ్మవిద్యా స్వరూపిణిగా ఎవరు అయినా అమ్మవారిని ఆరాధించవచ్చు. అయితే అమ్మవారి కృత మనపై ఉండేలా ఆరాధిస్తే కచ్చితంగా ఇక అన్నీ మంచి రోజులే అంటారు పండితులు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Today 21 July 2026 Horoscope

Today 21 July 2026 Horoscope: రాశుల వారి ఇంట్లో సమస్యలు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

Today 21 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు....
Week Days Significance

Week Days Significance: వారంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఎందుకు.. సంప్రదాయమా.. శాస్త్రమా..

Week Days Significance: వారంలో ఏడు రోజులు ఉంటాయి. ఇవన్నీ ఒకేలా అనిపిస్తాయి. కానీ భారతీయ సంప్రదాయంలో ప్రతి రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజును...
Today 20 July 2026 Horoscope

Today 20 July 2026 Horoscope: ఈ రాశుల వారిపై శివయ్య అనుగ్రహం.. అనుకోని లాభాలు..

Today 20 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు...
Today 26 February 2026 Horoscope

Today horoscope in telugu 19.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు రెట్టింపు ధన లాభాలు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని...
Today 18 July 2026 Horoscope

Today 18 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు శని దేవుడి ప్రభావం.....

Today 18 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై శని దేవుడి ప్రభావం వల్ల అన్ని...