Homeజాతీయ వార్తలుతంతే, వెళ్ళి బూరెల బుట్టలో పడ్డ నిత్యానంద!

తంతే, వెళ్ళి బూరెల బుట్టలో పడ్డ నిత్యానంద!

  ‘స్వామి నిత్యానంద’ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో పెద్దగా పరిచేయం అవసరం లేదు. ఎందుకంటే భారత్ లో ఉన్నప్పుడు స్వామిగారు చేసిన ఘన కార్యాలు అన్నీ, ఇన్నీ కావు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా పేరు గడించిన తర్వాత తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన విషయం తెలిసిందే. అయితే నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా, ఈ విలక్షణ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం […]

 

‘స్వామి నిత్యానంద’ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో పెద్దగా పరిచేయం అవసరం లేదు. ఎందుకంటే భారత్ లో ఉన్నప్పుడు స్వామిగారు చేసిన ఘన కార్యాలు అన్నీ, ఇన్నీ కావు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా పేరు గడించిన తర్వాత తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన విషయం తెలిసిందే. అయితే నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా, ఈ విలక్షణ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం క్రితమే అక్కడి దీవుల్లో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన స్వామీజీ దానికి కైలాసదీవి అని నామకరణం కూడా చేశారు. అంతేకాదు, తన దీవికి దేశం హోదా ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం! తంతే వెళ్లి బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో మరి!

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper