బాలకృష్ణ అసెంబ్లీలో రాజేసిన అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఆగట్లేదు. బాలయ్య, చిరంజీవి అ భిమానుల మధ్య ఫైట్ నెలకొంది. బాలయ్య అభిమానులు సంయమనం పాటించాలి. కానీ వారు అతి చేస్తున్నారు. రెచ్చిపోతున్నారు.
బాలకృష్ణ తగ్గకూడదు.. ఇలానే రెచ్చిపోవాలంటూ బాలకృష్ణ కు సపోర్టుగా ఫ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు. దీన్ని వైసీపీ అగ్గికి ఆజ్యం పోస్తోంది. మరింత ఎక్కువ చేయాలని చూస్తోంది. చంద్రబాబు దీన్ని చొరవ తీసుకొని పరిష్కారం కనిపెట్టాలి. ఆయనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో దీనిపై మాట్లాడాలి.
శనివారం అసెంబ్లీలో మాట్లాడడం.. హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసి పరిస్థితిని చల్లబరిచారు. పవన్ కళ్యాణ్ కూడా కనీసం ట్వీట్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్న చర్చ సాగుతోంది. పవన్ మెచ్చూర్డ్ గా ఆలోచించాడని అర్థమవుతోంది. పవన్ మౌనం కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ గా చెప్పొచ్చు.
ఎన్డీఏ కూటమి కొనసాగాలని.. ఈ కూటమి భవిష్యత్తు కోసం దిగమింగుకొనే పవన్ సైలెన్స్ పాటిస్తున్నాడు. చిరంజీవి మెగా అభిమానులు రగిలిపోతున్నారు.
తెలుగు సినిమా పెద్ద దిక్కు చిరంజీవి నే ఇప్పుడు తెలుగు సమాజ పెద్ద దిక్కుగా మారాలి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.