spot_img
Homeజాతీయ వార్తలుModi Formers: మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం రైతుల ముందు మోకరిల్లిందా?

Modi Formers: మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం రైతుల ముందు మోకరిల్లిందా?

Modi Formers: దేశంలో వ్యవసాయ సంస్కరణలను ప్రధాని మోడీ సాహసోపేతంగా అమలు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఉత్తరభారతంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు చేసిన ఏడాది నిరసనతో మోడీ తొలిసారి వెనకడుగు వేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. రైతుల కోరికలపై పూర్తిగా మోడీ దిగివచ్చాడు.

Modi Formers
modi formers

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతు కథ దేశంలో మారలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వ్యవసాయ సంస్కరణలు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ ధైర్యాన్ని మోడీ సర్కార్ చేసింది. కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంజాబ్, ఉత్తరప్రదేశ్ లు బీజేపీకి అత్యవసరమైన రాష్ట్రాలుగా ఉండడంతో ఎన్నికల కోసం మోడీ ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలోని పాలకులకు పట్టు విడుపులు ఉండాలి. కానీ రైతుల ధోరణి, వ్యవహారశైలి, ఆందోళనలను చూసి కూడా మోడీ సర్కార్ వెనకేసుకురావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రకోటపై దాడి చేసినా.. రహదారులు, రైళ్లు మూసేసినా.. సాగుచట్టాలు వెనక్కి తీసుకున్నా కూడా రైతుల ధోరణిలో సానుకూలత రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక ఎర్రకోటపై దాడులు చేసిన రైతులపై కేసులను వెనక్కి తీసుకొని  స్వేచ్ఛగా వదిలేయడం.. వారి ఒత్తిడికి తలొగ్గడం చూస్తుంటే అది నిరసనకారులకు బలాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. ఇదే మోడీ సర్కార్ వైఫల్యంగా చెప్పొచ్చని మేధావులు అంటున్నారు.

Also Read: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?

సంస్కరణలు అనేవి పూర్తిగా పక్కనపెట్టడం.. రైతుల కోరికలను ఆమోదించడం పెద్ద తప్పుగా చెప్పొచ్చు. వాతావరణ కాలుష్యం తగ్గింపుపై మోడీ సర్కార్ వెనకడుగు, శాంతిభద్రతలపై మోడీ సడలింపులు విమర్శలకు తావిచ్చింది.

మోడీ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే వెనక్కి పోడనే పేరుంది. కానీ రైతుల విషయంలో మోడీ ఎన్నికల కోసం ఎంతవరకైనా బెండ్ అవుతాడని అర్థమవుతోంది. ఎన్నికలు, అధికారం మోడీకి ముఖ్యమా? దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే సంస్కరణలు ముఖ్యమా? అంటే మోడీ ఎన్నికలకే ఓటేశాడు. సంస్కరణలకు పాతరేశాడు. ఇక్కడ మోడీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ‘రామ్ టాక్’ స్పెషల్ వ్యూ పాయింట్ ను కింది వీడియోలో చూడొచ్చు.

Also Read: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper