spot_img
Homeక్రీడలుVirat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్

Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్

Virat Kohli:  సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ క్రమంలోనే టీ20 కెప్టెన్సీ వదలుకున్న విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించింది. తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో తన కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్న వేళ విరాట్ కోహ్లీ అస్త్ర సన్యాసం చేశారు. తనదగ్గర ఉన్న టెస్ట్ కెప్టెన్సీని సైతం వదులుకొని సంచలనం సృష్టించారు.

ఇప్పటికే టీ20కి విరాట్ గుడ్ బై చెప్పాడు. ప్రపంచకప్ టీ20కి ముందే ఈ ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక వన్డేల నుంచి బీసీసీఐ పక్కనపెట్టింది. రోహిత్ శర్మకు పగ్గాలు అప్పజెప్పింది. తాజాగా విరాట్ తనదగ్గరున్న టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు.దీంతో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయ్యింది.

టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశాడు.‘ దాదాపు ఏడేళ్లుగా కెప్టెన్ గా జట్టును సరైన మార్గంలో నడిపించాను. బాధ్యతలను నిబద్దతతో నిర్వర్తించా.. ప్రతిదానికి ముగింపు ఉంటుంది. అది నాటెస్ట్ కెప్టెన్సీకి కూడా.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాక కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. ఈ సందర్భంగా బీసీసీఐకి, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనికి ధన్యవాదాలు.. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనికి కృతజ్ఞతలు’ అని విరాట్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లపై గెలిచి సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జట్టులో వన్డే , టీ20 కెప్టెన్ అయిన రోహిత్ శర్మతో విరాట్ కు విభేదాలున్నాయన్న గుసగుసలున్నాయి. అందుకే విరాట్ కెప్టెన్సీలో రోహిత్ ఆడకుండా రాలేదని టాక్ ఉంది. ఇక ఇటీవలే బీసీసీఐ, గంగూలీకి కోహ్లీతో విభేదాలు పొడచూపి మాటల యుద్ధానికి దారితీసింది. కామెంట్లు చేసుకున్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించడంపై కోహ్లీ విమర్శించడం.. గంగూలీ, బీసీసీఐ డిఫెన్స్ లో పడడం తెలిసిందే.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తను టెస్ట్ కెప్టెన్సీని కూడా వదలుకొని ఇక వీటన్నింటికి చెక్ చెప్పాడని తెలుస్తోంది. జట్టులో ఒక ఆటగాడిగానే కోహ్లీ కొనసాగుతాడు. ఆటగాడిగా కొనసాగుతాడా? లేదా రిటైర్ మెంట్ ప్రకటిస్తాడా? అన్నది వేచిచూడాలి.

ఇక విరాట్ కోహ్లీ టీమిండియా తరుఫున సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచారు. కోహ్లీ కెప్టెన్సీలో 68 టెస్టులు ఆడిన భారత జట్టు ఏకంగా 40 మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కోహ్లీ ఉన్నారు.కానీ అతడి సారథ్యంలో ఒక్క ప్రపంచకప్ కూడా గెలవకపోవడమే పెద్ద లోటు అని చెప్పొచ్చు.

https://twitter.com/imVkohli/status/1482340422987169794?s=20

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper