Chandrababu Sold Bananas: మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ అరటి పండ్లు అమ్మితే మాత్రం ఓట్లు పడతాయి.. 2024లో అధికారం దక్కుతుంది.. అదేంటి అరటి పండ్లు అమ్మితే ఓట్లు రావడం ఏంటి? అధికారం దక్కడం ఏంటి? అని సందేహ పడుతున్నారా… మాకు అలాంటి సందేహమే వచ్చింది. కానీ నిన్న శ్రీకాకుళంలో చంద్రబాబునాయుడు అరటి పండ్లు అమ్ముతూ ప్రజలను ఆకట్టుకున్నారు.. అంతేకాదు 2024 లో ఓటు వేసి గెలిపించాలని కోరారు.. గతంలో వ్యవసాయం దండగన్న ఆయన ఇప్పుడు అరటి పండ్లను నమ్ముకున్నారు.. 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లా పరిధిలోని ఉద్దండ రాయుని పాలెం గ్రామంలో భూములు ఇవ్వనని చెప్పిన రైతుల అరటి తోటలను తగలబెట్టించారు. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెట్టారు. ఆరోజున కర్పూరం వంటి అరటి పండ్లను పండించే రైతులు కన్నీరు పెట్టారు. జైలు గోడల మధ్య నరకం చూశారు. ఆ మంటల్లో కాలిపోయిన అరటి చెట్లు కూడా శపించాయి కాబోలు.. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు అరటి పండ్లు అమ్మే దుస్థితి వచ్చింది.

ఖమ్మం సభను ప్రచారం చేసుకున్నారు
సొంత డప్పు కొట్టుకోవడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా.. ఆ విషయంలో ఆయన పీహెచ్డీ చేస్తే.. ఆయన శిష్యుడు చంద్రశేఖర రావు పీజీ పూర్తి చేశారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో సాగిన పర్యటనలో సాంతం ఆయన వ్యక్తిగత సోత్కర్షకే పరిమితమయ్యారు. అంతేకాదు తాను తెలంగాణలో ఖమ్మంలో ఒక్క సభ పెడితే వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పుకొచ్చారు.. ఈ విషయంలో కొంత నిజాయితీ ఉన్నా.. మెజారిటీ ప్రజలు ఏదీ లేకుండా రాలేదు అనేది మాత్రం నిజం.. ఖమ్మంలో కూడా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అని ఈ వ్యవహారంలో జగన్ కు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. 23 దగ్గర కూర్చోబెట్టిన పగ ఊరికే పోతుందా..
ఇంతకీ అరటి పండ్లను ఎందుకు నమ్ముకున్నట్టు
కాళీ కడుపుకు అరటిపండు దివ్య ఔషధమని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.. ఒక రకంగా చెప్పాలంటే మరొక అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నాడు.. ఈ నేపథ్యంలో అరటిపండ్లే తనకు శ్రీరామరక్ష అని భావిస్తున్నాడు.

అందుకే నిన్న సిక్కోలు జిల్లాలో సాగిన పర్యటనలో అరటిపండ్లను అమ్మాడు. తన పార్టీ నాయకులకు కూడా అరటిపండ్లు తినాలని సూచించాడు. అంటే ఇప్పటికీ గాని అరటిపండ్ల పగ ఎలా ఉంటుందో చంద్రబాబుకు అర్థమయ్యే ఉంటుంది.. తన అనుచరులు అరటి చెట్లను కాల్చివేస్తే ఎంతటి ఉత్పాతం జరిగిందో బోధపడి ఉంటుంది.. అందుకే పెద్దలంటారు పచ్చని చెట్టు ని కాల్చితే పచ్చని సంసారమైనా బుగ్గిపాలవుతుందని… 2019లో ఇలాగే టిడిపి బుగ్గిపాలయింది. 23 దగ్గర ఆగిపోయింది.. తప్పు తెలుసుకున్న బాబు అరటిపండ్లను అమ్మాడు.. క్షమించమని వేడాడు. ఇంతకీ ఆ అరటి చెట్లు 2024 లో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.