spot_img
Homeప్రత్యేకంPawan kalyan : పవన్ కళ్యాణ్ లో ఆ మెచ్యూరిటీకి హ్యాట్సాఫ్ 

Pawan kalyan : పవన్ కళ్యాణ్ లో ఆ మెచ్యూరిటీకి హ్యాట్సాఫ్ 

Pawan kalyan : పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారా? జూన్ నుంచి రాజకీయ దండయాత్ర ప్రారంభించనున్నారా? వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారా? ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిఫేర్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి మరింత క్షేత్రస్థాయిలో తిరుగుతామని ప్రకటించారు. దీంతో వారాహి యాత్రకు సిద్ధపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వైసీపీపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తానని ప్రకటించడం ద్వారా ఇక తాను యాత్రలకు సిద్ధపడుతున్నట్టు స్పష్టం చేశారు.

అయితే వారాహి యాత్రకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వస్తోంది.పవన్ సినిమాల్లో బిజీగా ఉండడంతో యాత్ర జాప్యం జరుగుతూ వస్తోంది. అదిగో ఇదిగో షెడ్యూల్ అంటూ పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. కానీ యాత్ర ప్రారంభం కాలేదు. తొలుత వారాహి వాహనానికి కొండగట్టు, అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ పూజలు చేశారు. మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు పవన్ వారాహి వాహనంపై వచ్చారు. దీంతో యాత్రపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో ఇప్పట్లో యాత్ర చేయరని అంతా భావించారు. కానీ ఇప్పుడు పవన్ క్లారిటీ ఇచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పొత్తులు కచ్చితంగా ఉంటాయని పవన్ తేల్చిచెప్పారు. తమకు బలమున్నచోట మాత్రమే పోటీచేస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వారాహి యాత్ర పరిమిత నియోజకవర్గాల్లో చేపడతారా? లేకుంటే పొత్తు ధర్మం పాటించి కూటమి అభ్యర్థుల తరుపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే జూన్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలకు దిగుతామని చెప్పడం ద్వారా పవన్ పార్టీ శ్రేణులకు ఒకరకమైన మెసేజ్ ను మాత్రం పంపించగలిగారు. కచ్చితంగా జూన్ నుంచి వారాహి యాత్ర ఉంటుందని జన సైనికులు నమ్మకంగా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.

జూన్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper