Homeప్రత్యేకంమూడో వేవ్ విజృంభిస్తే ప్రమాదమే?

మూడో వేవ్ విజృంభిస్తే ప్రమాదమే?

కరోనా మూడో దశ ప్రారంభమైతే రాష్ర్టంలో 18 లక్షల మంది వైరస్ బారిన పడవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలి దశలో కంటే తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగితేనే ఈస్థాయిలో కేసులు వస్తాయని అంచనా వేసినట్లు కొవిడ్-19 పీడియాట్రిక్స్ స్పెషల్ టాస్క్ ఫో్ర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ 18 ఏళ్లలోపు పిల్లలు 4.50 లక్షల మంది ఉంటారు. వీరిలో 4.05 లక్షల మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతారు. మధ్యస్థ లక్షణాలతో 36 వేల మంది ఆస్పత్రుల్లో చేరతారు. వీరిలోనూ 9000 మంది పిల్లలు ఐసీయూలో చికిత్స పొందుతారు.
మూడో వేవ్ ఉంటుందా? లేదా? అన్న దాని గురించి స్పష్టత లేదు.సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్గగా పిల్లలకు తగిన వైద్యం అందించేందుకు వీలుగా ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. మూడో వేవ్ ఉందంటున్న హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు ఏ స్థాయిలో వైరస్ బారిన పడవచ్చునన్న దానిపై కొవిడ్ పీడియాట్రిక్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ విశ్లేషణ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు కోటిన్న మంది 18 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వైరస్ ఉధృతి పెరిగే 90 రోజుల్లో 75 శాతం మంది పిల్లలకు సంక్రమిస్తుందని పేర్కొంది. రోజుకి 1100 మంది ఆస్పత్రుల్లో పడే అవకాశం ఉంది.

పిల్లల ఆరోగ్య పరిస్థితి అనుసరించి రెమ్ డెసివిడ్ అంపోటెరిసిన్ ఇంజక్షన్లు మఖ్యమైన సిరప్స్ తో కలిపి మొత్తం 38 రకాల మందులు సిద్ధం చేయాలని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. 2 రకాల పరిమాణాల్లో ఆక్సిజన్ మాస్కులు, వెయింగ్ మిషన్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య పరికరాలు ఏమేమి అవసరం అవుతాయో కూడా వివరించింది. వీటిల్లో ఇప్పటికే 70 శాతం నుంచి 80 శాతం వరకు వైద్య ఆరోగ్య శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి.

కొత్తగా వంద వెంటిలేటర్లు కొనుగోలు చేయడంతో పాటు అదనంగా నర్సులను నియమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీదైన ఇమ్యూనోగ్లోబలిన్ ఇంజక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్న చిన్న పిల్లలకు ఇస్తారు. 5 ఎంజీధర రూ.13,000 వరకు ఉంది. కనీసం 5 ఇంజక్షన్థు వాడాల్సి వస్తుంది. కొన్ని ఇంజక్షన్లు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్నాయి. జాతీయ స్థాయిలో వయసుల వారీగా ఇఫ్పటివరకు నమోదైన కరోనా వైరస్ కేసుల శాతం ఇంచుమించు ఒకేలా ఉంది. వైరస్ సోకిన 20 ఏళ్ల లోపు వారు జాతీయస్థాయిలో 11.73 శాతం మంది ఉన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Oktelugu Epaper