
జగనన్న తోడు పథకం కింద రెండో ఏడాది నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో ని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు రూ. 370 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని గత్యంతరం లేక వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకుని వారు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లేనని జగన్ వ్యాఖ్యానించారు.